సింపుల్‌గా టాలీవుడ్ స్టార్ హీరో కూతురి పెళ్లి
X
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ చిన్న కూతురు హయవాహిని దగ్గుబాటికి విజయవాడకు చెందిన వైద్యుడు నిశాంత్ వివాహం చేసుకున్నాడు. 2023 అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. పాతూరి వెంకట రామారావు, అరుణ దంపతుల కుమారుడే నిశాంత్. ప్రస్తుతం పెళ్లైన కొత్త జంటతో వెంకటేష్ దగ్గుబాటి, ఆయన భార్య నీరజ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, ఇరు కుటుంబాలవారు హాజరయ్యారు. ఇకపోతే గ్రాండ్ సెలబ్రిటీ వెడ్డింగ్‌లకు భిన్నంగా వివాహం జరిగింది. మార్చి 15న అత్యంత సింపుల్‌గా వివాహ తంతును జరిపించారు. పెళ్లిలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా అందమైన జంట జీవితకాలం ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నమ్రత సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేశారు.
కాగా వెంకటేష్, నీరజ దంపతులు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె అశ్రితకు 2019లో వినాయక్ రెడ్డితో వివాహం అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. అశ్రిత ప్రేమ వివాహం చేసుకోగా, హయవాహిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వెంకటేష్ కుమార్తె పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.