కీరవాణిని వెంటాడిన ‘చంద్రముఖి 2’..రెండు నెలలు పడుకోలేదని ట్వీట్
X
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ , ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఎలాంటి పాటకైనా సెకెండ్స్‌లో అద్భుతమైన బాణీలను సమకూర్చగలరు . అలాంటిది ఆయన గత రెండు నెలలుగా ఓ సినిమా కోసం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా బాణీలను కూర్చుతూ నిద్రలేమితో సతమతమయ్యారట. తనను ఏ శక్తి అంతలా వెంటాడిందో తాజాగా ఓ ట్వీట్‌లో తెలిపారు కీరవాణి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి గారి ప్రతిభ విశ్వవ్యాప్తంగా విస్తరించింది. ఈ మూవీలో ఈయన స్వరపరిచిన నాటు నాటు పాటకు అందరూ ఫిదా అయిపోయారు. నాటు నాటు అంటూ ప్రపంచమంతా ఆడిపాడిందంటే ఆయన టాలెంట్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్‌తో సహా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు కీరవాణి. ఆర్ఆర్ఆర్ మానియా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న కీరవాణి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు, లారెన్స్ మూవీ చంద్రముఖి 2 కు మ్యూజిక్‌ను అందిస్తున్నారు . రాసెంట్గానే ‘చంద్రముఖి 2’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో కీరవాణి ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాణం పోసేందుకు ఎంతలా కష్టపడ్డారో తన ట్విటర్ అకౌంట్ ద్వారా అనుభవాలను పంచుకున్నారు.
" చంద్రముఖి 2లోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన మైండ్‌బ్లోయింగ్ సీన్లు ఉన్నాయి. వాటికి నా మ్యూజిక్‌తో ప్రాణం పోసేందుకు నిర్విరామంగా 2 నెలలు సమయం కేటాయించాను. ఈ రెండు నెలలు నిద్రలేని రాత్రులు, పగళ్లు గడిపాను. గురుకిరణ్, ఫ్రెండ్ విద్యాసాగర్.. నాకు సక్సెస్ రావాలని కోరుకోండి"అని కీరవాణి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ‘చంద్రముఖి 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం కీరవాణి రెండు నెలలు కష్టపడ్డారని చెప్పకనే చెబుతున్నారు. అయితే వీరిద్దరి పేర్లను ఎందుకు జోడించారనే టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. చంద్రముఖి సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన నాగవల్లికి గురు కిరణ్ స్వరాలు స్వరపరిచారు. ఈ జోనర్ సినిమాలకు తనకంటే ముందే సంగీతాన్ని ఇవ్వడం వల్లే కీరవాణి తన ట్వీట్‌లో వీరిద్దరినీ తలచుకున్నట్లు తెలుస్తోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.