Home > సినిమా > సింగర్ సునీత కొడుకు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ.. ఎమోషనల్ పోస్ట్..!

సింగర్ సునీత కొడుకు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ.. ఎమోషనల్ పోస్ట్..!

సింగర్ సునీత కొడుకు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ.. ఎమోషనల్ పోస్ట్..!
X

టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత కొడుకు ఆకాశ్‌.. టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆకాశ్‌ నటించిన సర్కారు నౌకరి సినిమా ఫస్ట్ లుక్ ను మూవీ టీం శనివారం విడుదల చేసింది. ఈ సినిమాను గంగమనేని శేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కె. రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ ను ఉద్దేశిస్తూ సునీత సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.





‘శుభాకాంక్షలు ఆకాశ్‌.. కొడుకు కల నెరవేరినందుకు తల్లిగా నేను చాలా సంతోష పడుతున్న. యాక్టర్ కావాలని నువ్వు పడ్డ శ్రమ, ప్రొఫెషన్ పట్ల నీకున్న నిబద్ధత, లైఫ్ లో నువ్వు చేసిన త్యాగాలు.. ఈ సినిమా పోస్టర్ కు అద్దం పడుతున్నాయి. సినిమాలపై నీకున్న పిచ్చిని ఈ లోకం త్వరలో చూడబోతోంది. నీకు లైఫ్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది.



Updated : 1 July 2023 10:07 PM IST
Tags:    
Next Story
Share it
Top