Home > సినిమా > అది పెళ్లి కాదు..ఎంగేజ్మెంటేనా? అదితి పోస్ట్ వైరల్

అది పెళ్లి కాదు..ఎంగేజ్మెంటేనా? అదితి పోస్ట్ వైరల్

అది పెళ్లి కాదు..ఎంగేజ్మెంటేనా? అదితి పోస్ట్ వైరల్
X

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది. వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరికి జరిగింది పెళ్లి కాదని, అది ఎంగేజ్మెంట్ మాత్రమేనని స్పష్టం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ జంట ప్రేమలో ఉంది. మహా సముద్రంలో మూవీలో కలిసి నటించినప్పటి నుంచి ఈ జంట అనేక ప్లేస్‌లు తిరుగుతూ మీడియా కంట పడుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చూస్తే ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వినిపించాయి.

అయితే నిన్న వనపర్తిలో పెళ్లి కూడా జరిగిపోయిందని నెట్టింట స్టోరీలు వైరల్ అయ్యాయి. అయితే పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాలేదు. దీంతో పెళ్లిపై క్లారిటీ రాలేదు. తాజాగా నేడు తన పెళ్లి వార్తలపై అదితిరావు హైదరి ఓ పోస్టు పెట్టింది. 'అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్' అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఫోటోలో ఇద్దరూ కొత్త ఉంగరాలతో కనిపించారు.

దీంతో ఈ జంటకు నిన్న జరిగింది పెళ్లి కాదని, నిశ్చితార్థం మాత్రమేనని ఓ క్లారిటీ వచ్చింది. మొత్తానికి డేటింగ్‌లో ఉన్న ఈ జంట మూడేళ్ల ప్రేమను ఇలా అధికారికంగా బయటపెట్టింది. మరి ఈ జంట పెళ్లెప్పుడు చేసుకుంటుందో ఇంకా చెప్పలేదు. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated : 28 March 2024 12:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top