Home > సినిమా > Skanda: అమ్మింది అరవైకి, వచ్చింది పాతిక.. అయినా హిట్టేనట

Skanda: అమ్మింది అరవైకి, వచ్చింది పాతిక.. అయినా హిట్టేనట

Skanda: అమ్మింది అరవైకి, వచ్చింది పాతిక.. అయినా హిట్టేనట
X

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కంద. శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. సెప్టెంబర్ 28న విడుదలైన స్కందకు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. కథ, కథనాల పరంగా బోయపాటి పూర్తిగా నేల విడిచి సాము చేశాడు. బోయపాటి సినిమా అని ముందుగానే ప్రిపేర్ అయి వెళ్లినా.. మరీ ఓవర్ ద టాప్ వెళ్లిపోయాడు. చాలామంది ఈ మూవీ చూసి బోయపాటికి మైండ్ దొ.. దా అనుకున్నారు. నిజానికి సాయంత్రానికే థియేటర్స్ ఖాళీ అయ్యాయీ చిత్రానికి. అయినా బ్లాక్ బస్టర్ అంటూ కవరింగులు సేత్తన్నారు.

స్కంద చిత్రాన్ని 60 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మేశారు.అందులో సగానికి పైగా ఫస్ట్ వీకెండ్ లోనే తేవాలి. స్కంద మొదటి రోజు 18 కోట్ల గ్రాస్ వసూలు చేసినా రెండో రోజుకు పడిపోయింది. స్కందతో పాటు విడుదలైన సినిమాలకూ ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఇది పుంజుకోలేదు. అలాంటి సినిమా బ్లాక్ బస్టర్ ఎలా అవుతుందీ.. పైగా కలెక్షన్స్ కూడా చూపించి మరీ అంటున్నారు. మరి ఈ మూవీ తొమ్మిది రోజుల్లో కలెక్ట్ చేసిన మొత్తం ఎంతో తెలుసా.. కేవలం 25. 87 కోట్లు. కాస్త అటూ ఇటూగా 26 కోట్లు. అంటే ఇంకా 34 కోట్లు రాబట్టాలి. అది సాధ్యమా అంటే అసాధ్యం అని ఎవరైనా చెబుతారు. అలాంటి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ అనడం మాత్రం హాస్యాస్పదంగానే ఉంది. అఫ్ కోర్స్ ఒకవేళ పోయిందీ అని చెబితే కూడా నష్టం లేదు. ఎందుకంటే ఈ నిర్మాతలు ఎప్పుడో టేబిల్ ప్రాఫిట్స్ లో ఉన్నారు. స్కంద డిజిటల్ రైట్స్ ఏకంగా 98 కోట్లకు(అన్ని భాషలకూ కలిపి) అమ్ముడుపోయాయి. ఆ రకంగా నిర్మాతలు సేఫ్. బట్ థియేట్రికల్ గా సినిమా కొన్నివాళ్లు లాస్. అదీ మేటర్.

Updated : 7 Oct 2023 12:02 PM IST
Tags:    
Next Story
Share it
Top