Skanda Twitter Review: స్కంద ట్విట్టర్ రివ్యూ.. 'అఖండ' రేంజ్‌లో హీరో ఎంట్రీ
X
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్స్ రామ్ పోతినేని (Ram Pothineni), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్ తెరకెక్కిన ఊరమాస్ మూవీ ‘స్కంద’. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్, పాటలు మాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్నిచోట్ల మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు (Skanda Twitter Review) స్కంద సినిమా పై ట్విటర్ లో పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూలు పెడుతున్నారు. ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడట. సినిమా చూసిన నెటిజన్స్ ఏయే ట్వీట్స్ చేశారో ఓసారి చూద్దాం.
స్కందలో రామ్‌మాస్ ఎంట్రీ.. అదిరిపోయిందని అభిమానులు.. సినిమాలోని హీరో ఎంట్రీ సీన్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ సీన్ లో రామ్.. దున్నపోతును తీసుకొస్తున్నట్లుగా.. ఆ స్టైల్ చూసి అమ్మాయిలు మనసు పారేసుకున్నట్లుగా ఉంది. ఆ పోస్ట్ లో.. రామ్ మాస్ ఎంట్రీ, మాస్ బీజీఎం, మాస్ ఫీస్ట్ అని జత చేశారు.
సినిమా అదిరిపోయిందని ఒకరు, బాలయ్య అఖండ రేంజ్ లో ఉందని మరొకరు ట్విట్టర్ లో రివ్యూలు ఇస్తున్నారు. అలాగే యూఎస్ లో బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ యాక్షన్స్ సీన్స్ హైలైట్ అని అంటున్నారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయని అంటున్నారు.
ప్యాన్ ఇండియా అన్నావ్.. కనీసం హిందీలో షోలు లేవు.. కర్ణాటక, తమిళ్‌లో లేవు.. సరైన విధంగా ఎప్పుడూ రిలీజ్ చేయవు.. హిందీలో కనీసం చెప్పుకునే స్క్రీన్స్‌ని అయినా తీసుకోండి అని ఓ నెటిజన్ తన ఆవేదనను తెలియజేశాడు.
స్కంద టైటిల్ కార్డ్, ఆ టైంలో బీజీఎం అదిరిపోయిందని తమన్ మీద నెటిజన్ ప్రశ్నలు కురిపిస్తున్నాడు. బాలయ్య బాబుకు స్పెషల్ థాంక్స్ కార్డ్ వేశాడని చెప్పుకొచ్చాడు. అఖండ రేంజ్‌లో ఇచ్చావ్ కదా? అంటూ టైటిల్ కార్డ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్లు వేస్తున్నారు. టైటిల్ కార్డ్‌లోనే తమన్ తన డ్యూటీ మొదలుపెట్టేశాడని పొగిడేస్తున్నారు.
స్కందలో రామ్‌ది మాస్ ఎంట్రీ.. అదిరిపోయింది.. ఆ సీన్‌కు తమన్ ఇచ్చిన ఆర్ఆర్, రామ్ స్క్రీన్ ప్రజెన్స్ రెండూ అద్భుతంగా ఉన్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కచ్చితంగా హిట్టు కొడుతున్నామని ధీమాగా చెప్పేస్తున్నారు.