Home > సినిమా > స్లమ్ డాగ్ హస్బెండ్ పెద్ద హిట్ కావాలి - శ్రీలీల

స్లమ్ డాగ్ హస్బెండ్ పెద్ద హిట్ కావాలి - శ్రీలీల

స్లమ్ డాగ్ హస్బెండ్ పెద్ద హిట్ కావాలి - శ్రీలీల
X

స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని హీరోయిన్ శ్రీలీల అన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా హాజరైన ఆమె మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అల్లు అర్జున్ గారు అన్నట్టుగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎక్కువగా రావాలని శ్రీలీల అన్నారు. కావ్య, వైష్ణవి తరువాత ప్రణవి పరిచయం అవడం సంతోషంగా ఉందన్నారు. ఇందాకటి నుంచి ప్రణవి తను టిప్స్ అడుగుతోందని మన హద్దుల్లో మనం ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరని చెప్పారు.


స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీలో హీరోగా అవకాశమిచ్చిన మైక్ మూవీస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని హీరో సంజయ్ రావ్ అన్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన కొత్త టాలెంట్, కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు తీయడంతో మైక్ మూవీస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. రిస్క్ తీసుకుని కొత్తవారికి అవకాశమిచ్చే ప్రొడక్షన్ హౌస్ లు అతి తక్కువగా ఉంటాయని, కొత్త ఆర్టిస్టులపై నమ్మకంతో అవకాశాలు ఇస్తున్న నిర్మాత అప్పిరెడ్డికి సంజయ్ రావు ధన్యవాదాలు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకునివెళ్లారని అన్నారు. ఒక నటుడిగా తన పేరెంట్స్ తనను ఎంకరేజ్ చేస్తున్న తీరును ఎప్పటికీ మరిచిపోలేనంటూ ఎమోషనల్ అయ్యారు.


మైక్ మూవీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని హీరోయిన్ ప్రణవి అన్నారు. తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసే వాళ్లలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. తనకు సినిమాలో అవకాశమిచ్చిన అప్పిరెడ్డి, వెంకట్ కు ప్రణవి కృతజ్ఞతలు చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారని, థియేటర్స్ బయటికి వస్తూ కూడా నవ్వుతూనే ఉంటారని అన్నారు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశంరావడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రణవి సంతోషం వ్యక్తంచేశారు.



Updated : 28 July 2023 9:24 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top