10 మంది కొత్త డైరెక్టర్లకు అవకాశమిస్తా... అప్పిరెడ్డి
X
తెలుగు సినీచరిత్రలో ఎవరూ చేయని ప్రయోగాలు చేస్తున్న మైక్ మూవీస్ తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఈ నెల 29న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టాప్ హీరోయిన్ శ్రీలీలతో పాటు, యంగ్ హీరో సోహెల్ పలువురు సినీదిగ్గజాలు హాజరయ్యారు. నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి మాట్లాడుతూ సరికొత్త కథలతో సినిమాలు తీయాలన్నది తన లక్ష్యమన్నారు. ఇలాంటి కొత్త చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమా వస్తాయన్నారు. ‘‘వైవిధ్యభరితమైన ఈ చిత్రాలను ఆదరిస్తే కొత్త నటులకు, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తాం. ఈ సినిమాను హిట్ చేస్తే పదిమంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తాను.. స్లమ్ డాగ్ హస్బెండ్‌లో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఇది కడుపుబ్బా నవ్వించే చిత్రం. ఇందులో నటించిన అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది.. బ్రహ్మాజీ గారు ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయకు ధన్యవాదాలు..’’ అన్నారు. తనను ప్రోత్సహిస్తున్న తోటి సినీ నిర్మాతలకు, కుటుంబ సభ్యుకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎ.శ్రీధర్ దర్శకత్వం వహించారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ నిర్మించారు.