OTT: మిస్టర్ ప్రెగ్నెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
X
"రీసెంట్గా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. (Mr Pregnant Movie) డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మగవాడు గర్భం ధరిస్తే ఎలా ఉంటుంది, ప్రసవవేదనను ఎలా భరిస్తాడు అనే ఆసక్తికర కథతో ఈ సినిమా తెరకెక్కింది. (OTT Release) అగస్ట్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది.
మిస్టర్ ప్రెగ్నెంట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్ట్రీమింగ్ డేట్ ను నిర్మాణ సంస్థ మైక్ మూవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అక్టోబర్ 6ను అమెజాన్ ప్రైమ్లో మిస్టర్ ప్రెగ్నెంట్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో సోహైల్ హీరోగా నటించగా.. అతనికి జంటగా రూపా కొడువాయుర్ కనిపించింది. సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేయగా.. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు.
#MrPregnant is ready to Deliver the Laughs on Amazon Prime Video Starting 6th October!#Amazonprimevideo@RyanSohel @RoopaKoduvayur @SVinjanampati @actorbrahmaji @Appireddya @SajjalaRavi @Mic_Movies @GskMedia_PR @VillageGroupe pic.twitter.com/EopSpBWzhQ
— Mic Movies (@Mic_Movies) September 28, 2023