జిమ్ డ్రెస్లో పెళ్లికి అమీర్ ఖాన్ అల్లుడు
X
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్.. తాను ప్రేమించి నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం (జనవరి 3) వీరి వివాహం ముంబైలోని స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. కాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఈ జంట ఒక్కటయ్యారు. అయితే పెళ్లి వేడుకకు వరుడు నుపుర్ జిమ్ డ్రెస్ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
స్వయానా నుపుర్ జిమ్ ట్రైనర్ కావడంతో.. పెళ్లి జరిగే చోటుకు కూడా జిమ్ డ్రెస్ లోనే వచ్చాడు. జిమ్ డ్రెస్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని, అనంతరం జరిగిన రిసెప్షన్ లో కొత్త బట్టలు వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. జిమ్ ట్రైనర్ పెళ్లి అంటే మాములుగా ఉండదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.