Sona Mohapatra : ఐశ్వర్య రాయ్పై రాహుల్ వివాదాస్పద కామెంట్స్.. సింగర్ ఫైర్
X
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దళితులు, వెనకబడిన వర్గాలను బీజేపీ చిన్నచూపు చూసిందని మండిపడ్డారు. కనీసం రాష్ట్రపతిని అయినా పిలవకపోవడం వారిని అవమానించడమేనని ఆరోపించారు. ఈ క్రమంలో అమితాబ్, ఐశ్వర్య పేరును తీసుకొచ్చారు.
బిజినెస్మేన్స్ సహా అమితాబ్ లాంటి వారిని ఆహ్వానించడం దేశంలోని వెనకబడిన వర్గాలను అవమానించడమే అని రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా పలు ఈవెంట్లో ఐశ్వర్య డ్యాన్స్ చేస్తే అమితాబ్ బల్లే బల్లే అంటారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చానెళ్లు ఐశ్వర్య డాన్సులు చూపిస్తాయి కానీ పేదల సమస్యలను చూపించవని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ ప్రసంగాల్లో మహిళలను లాగడం ఎందుకని సింగర్ సోనా మొహాపాత్ర మండిపడ్డారు. గతంలో రాహుల్ తల్లి, చెల్లిని కొందరు అవమానించారని.. కానీ ఇప్పుడు రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. సినీ నటి కుష్బూ సహా కర్నాటర్ బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.