Home > సినిమా > అలాంటివారే ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు-సోనమ్ కపూర్ ఘాటు పోస్ట్

అలాంటివారే ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు-సోనమ్ కపూర్ ఘాటు పోస్ట్

అలాంటివారే ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు-సోనమ్ కపూర్ ఘాటు పోస్ట్
X

బాలీవుడ్ నటి, అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. అమెరికన్ సామాజికవేత్త ఎలియనోర్ రూజ్ వెల్ట్ చెప్పిన కోట్ ను తన ఇన్స్టాలో పెట్టంది సోనమ్. అది ఎవరిని ఉద్దేశించి పెట్టిందా అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు నెటిజన్లు.





సోనమ్ కపూర్...ఈమధ్యనే తల్లి అయిన ఈ నటి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. సోనమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన లైఫ్ గురించి ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది కూడా. తాజాగా ఆమె...సంకుచిత మనస్తత్వం కలవారు ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఓ మాదిరిగా ఆలోచించేవారు పరిస్థితుల గురించి చెబుతారు. గొప్ప మనసు కలిగిన వారు ఆలోచనల గురించి చర్చిస్తారు అనే ఎలియనోర్ రూజ్ వెల్ట్ కోట్ ను తన ఇన్స్టాలో పెట్టింది. పైగా ఇది చిన్న విషయమే అయినప్పటికీ కొంతమంది దీనిని గ్రహించాలనుకుంటున్నా....ముఖ్యంగా ఎదుటివారి గురించి మాట్లాడుతున్నప్పుడు మరీ ఎక్కఉవ గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా అంటూ రాసుకొచ్చింది కూడా. సోనమ్ ఈ పోస్ట్ ఎవరి గురించి పెట్టింది అన్న విషయమై మాట్లాడుతుకుంటున్నారు నెటిజన్లు. ఇంకెవరి గురించి మన రానా గురించే అని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు మరి కొందరు.





ఈమధ్య జరిగిన కింగ్ ఆఫ్ కోథా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా...బీటౌన్ స్టార్ హీరోయిన్ గురించి చెప్పారు. షూటింగ్ టైమ్ లో ఫోన్ మాట్లాడుకుంటుంది అని...సరిగ్గా డైలాగ్స్ చెప్పడం కూడా రాదంటూ వ్యాఖ్యలు చేశాడు. దుల్కర్ సల్మాన్ పెద్ద మనసుతో సహకరించాడని కూడా చెప్పారు. ఇది చాలా పెద్ద చర్చకు దారి తీసింది. దుల్కర్ , సోనమ్ కలిసి ఒక సినిమా చేశారు. దాంతో సోనమ్ గురించే రానా చెప్పాడని అందరూ అనుకున్నారు. అయితే తర్వాత రానా మళ్ళీ తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్ళాయని...దుల్కర్, సోనమ్ లకు ఇబ్బంది కలిగించినందుకు సారీ కూడా చెప్పాడు. రానా పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోనమ్ ఈ కోట్ పోస్ట్ పెట్టడంతో...కచ్చితంగా ఇది రానా కోసమే అయి ఉంటుందని అంటున్నారు.


Updated : 16 Aug 2023 4:52 PM IST
Tags:    
Next Story
Share it
Top