Home > సినిమా > మెరిసిపోతున్న మలయాళీ అందం..ఆమె పాట ఎంతో మధురం

మెరిసిపోతున్న మలయాళీ అందం..ఆమె పాట ఎంతో మధురం

మెరిసిపోతున్న మలయాళీ అందం..ఆమె పాట ఎంతో మధురం
X

అతి తక్కువ సమయంలోనే నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళ ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది 'అ..ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అలా తన కెరీర్‎లో మంచి మంచి కథలను ఎన్నుకుంటూ నటిగా తనను తాను ప్రూవ్ చేసింది ఈ చిన్నది. ఈ మధ్యనే విడుదలైన కార్తికేయ2 సినిమాతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తరువాత అనుపమ నటించిన 18 పేజెస్, బటర్‎ఫ్లై సినిమాలకు కూడా సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. లేటెస్టుగా అనుపమ సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‎పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తోంది. ఈ మూవీలో కాస్త డిఫరెంట్ గా కనిపించబోతోంది ఈ చిన్నది. దీనితో పాటే అను రవితేజ ఈగల్‎లోనూ నటిస్తోంది.





ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు సోషల్ మీడియాలోనూ అనుపమ చాలా యాక్టివ్‎గా ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా అనుపమ ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను, పర్సనల్ విషయాలను నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. తన ఫాలోవర్స్‎ను ఖుషీ చేస్తుంటుంది. తాజాగా అనుపమ తన ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను , ఓనమ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు, వీడియో కాస్త నెట్టింట్లో ఓ రేంజ్‎లో దూసుకెళ్తోంది. ఈ వీడియోలో అనుపమ మలయాళంలో ఎంతో మధురంగా ఓ పాట పాడింది. ఓనమ్ స్పెషల్ అంటూ తనలోని టాలెంట్‎ను నెటిజన్స్‎కు చూపించింది.




















Updated : 29 Aug 2023 7:00 PM IST
Tags:    
Next Story
Share it
Top