రూ. 500 కోట్లు ఇచ్చినా చేయను.. మాళవిక మోహనన్
X
ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకుని మెప్పించే సూపర్ టాలెంట్ నటి మాళవికా మోహనన్. మలయాళ, తమిళ సినిమాల్లో ఓ రేంజులో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం మంచి సినిమా ఇంకా పడలేదు. ‘మాస్టర్’లో విజయ్ పక్కన కనిపించినా తెలుగువాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. రజనీకాంత్, ధనుష్‌తో టాప్ సినిమాలు చేసిన మాళవిక పాత్రల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. చిల్లర పాత్రలు కాకుండా, ప్రాధాన్యమున్న పాత్రలకే తన ఓటు అని చెబుతోంది.
‘‘పెద్ద హీరో, బడ్జెట్ ముఖ్యం కాదు. నా పాత్ర ఎలా ఉంటుందని, దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారనేదే నాకు ముఖ్యం. అది నచ్చకపోతే రూ. 500 కోట్లు ఇచ్చినా చేయను. ప్రాధాన్యం లేని పాత్రలో నటించిన సినిమా హిట్ అయితే కావొచ్చు. కానీ నాకేమీ పేరు రాదు కదా’’ చెప్పింది. 30 ఏళ్ల మాళవిక మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. 'పట్టం బోల' చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఆమె 'పేట'లో రజనీకాంత్‌తో జట్టుకట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా వస్తున్న ‘యుధ్రా’లో నటిస్తోంది.