Home > సినిమా > Shakila : ఈవీవీ నన్ను గదిలోకి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణ

Shakila : ఈవీవీ నన్ను గదిలోకి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణ

Shakila : ఈవీవీ నన్ను గదిలోకి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణ
X

తెలుగు సినీపరిశ్రమలో సాగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం శ్రీరెడ్డితో వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. ఆ దారుణం ఆమెతోనే మొదలు కాలేదని పలువురు చెప్పినా పేర్లు మాత్రం బయటపెట్టలేదు. నిందితుల పేర్లు చెబితే సినిమా అవకాశాలు దక్కవనే భయమే దీనికి కారణం. అయితే తమిళనటి విచిత్ర టాలీవుడ్‌లో తను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఓ హీరో బలవంతం చేయడంతో సినిమాలకు స్వస్తి పలికానని చెప్పి బాంబు పేల్చింది. ఆ హీరో పేరేంటో ఆమె చెప్పకపోయినా ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం ‘భలేవాడివి బాసూ’ కావడంతో వేధించింది బాలకృష్ణ అని తమిళ మీడియా కోడై కూసింది. తాజాగా శృంగార నటి షకీల మరో బాంబు పేల్చింది.

దివంగంత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనను గదిలోకి రమ్మన్నారని షకీల చెప్పింది. ఓ తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె టాలీవుడ్‌లో తను చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని వివరించింది. అల్లరి నరేశ్ తండ్రి తనను అడ్జస్ట్‌మెంట్ అడిగాడంటూ ఈవీవీ గురించి చెప్పింది. ఇప్పుడాయన మన మధ్య లేకపోయినా ఆ విషయం నిజమని, ఎవరడిగినా ఆ సంగతి చెబుతానని తెలిపింది. ‘‘అల్లరి నరేశ్ తండ్రితో ఓ సినిమా చేశా. తనతో గడిపితే మరో సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు. తన గదికి రమ్మన్నాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఈ సినిమాలో నటించినందుకు నాకు డబ్బులిచ్చేశారు. ఇంకో సినిమా నాకు వద్దు అని చెప్పాను’’ అని షకీలా అంది. విచిత్ర వ్యవహారంపైనా ఆమె స్పందించింది. ‘‘విచిత్ర తనను వేధించిన నటుడి పేరు చెప్పి ఉండాల్సింది. ఎవరి కారణంగా సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో చెప్పి ఉంటే బావుండేది’’ అని చెప్పింది.


Updated : 27 Nov 2023 6:00 PM IST
Tags:    
Next Story
Share it
Top