మోత మోగించిన విశ్వక్ సేన్..‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సాంగ్ రిలీజ్
X
'గామి' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్ మరో మూవీతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించడానికి వచ్చేస్తున్నాడు. త్వరలోనే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విడుదల కానుంది. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రూపొందుతోంది. మే 17న ఈ మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇది వరకే ఈ మూవీ నుంచి ఓ సాంగ్, టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
గోదావరి జిల్లాల్లో పీరియాడిక్‌గా పొలిటికల్ స్టోరీతో ఈ మూవీ రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'మోత మోగిపోద్ది' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. మాస్ ఐటెం సాంగ్ అదిరిపోయింది. సాంగ్‌లో అయేషా ఖాన్ స్టెప్పులు అదిరిపోయాయి. విశ్వక్ సేన్ మాస్ లుక్‌లో వేసిన డ్యాన్స్ హైలెట్ అని చెప్పాలి. చంద్రబోస్ రాసిన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
సింగర్ మానసి పాడిన ఈ పాట కర్రాళ్లతో చిందులేయిస్తోంది. ఓం భీమ్ బుష్ మూవీలో ప్రియదర్శి సరసన నటించిన అయేషాఖాన్ ఆ మూవీతో బాగా పాపులర్ అయ్యింది. తన అందాలతో కుర్రాళ్ల మనసును దోచేసిన ఈ బ్యూటీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. మరి మీరూ చూసేయండి.