Home > సినిమా > Sandeep Reddy Vanga : స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ అదే.. క్రేజీ అప్టేడ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga : స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ అదే.. క్రేజీ అప్టేడ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga : స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ అదే.. క్రేజీ అప్టేడ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
X

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటించిన కల్కి మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఆయన ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అటు వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు సందీప్ రెడ్డి వంగా. ఇటీవల ఆయన తీసిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే వీరిద్దరీ కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్టేడ్ ఇచ్చారు సందీప్ రెడ్డి. ఇటివల ఓ బాలీవుడ్‌ మూవీ టీజర్‌ లాంఛ్‌ లో పాల్గొన్న ఆయన ‘స్పిరిట్‌’పై స్పందించారు. ఆయన ప్రస్తుతం ప్రభాస్‌తో చేయనున్న మూవీ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు స్పిరిట్ హారర్‌ స్టోరీ కాదని... ఓ నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ కథ అని డైరెక్టర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రభాస్ మూవీ తర్వాత యానిమల్ పార్క్‌’ను రూపొందిస్తా అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్ వేయనున్నారు. సందీప్ అప్టేట్ తో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే ఎనిమిది భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ప్రభాస్‌ మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. రొమాంటిక్‌ హారర్‌ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఈ మూవీలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డార్లింగ్ నటించిన మరో మూవీ ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు.


Updated : 29 Feb 2024 6:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top