Home > సినిమా > దానికి ఇంకా చాలా టైం ఉంది.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

దానికి ఇంకా చాలా టైం ఉంది.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

దానికి ఇంకా చాలా టైం ఉంది.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
X

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న నటి శ్రీలీల. పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ధమాకా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం నితిన్, బాలకృష్ణ, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ లతో వరుస సినిమాల్లో రెచ్చిపోతోంది. ఇవాళ శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా.. సోషల్ మీడియాను ఆవిడ పోస్టర్లు ఊపేస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ‘వరుసగా ఇన్ని సినిమాలు చేస్తున్నారు.. రిస్క్ అనిపించట్లేదా’ అని అడిగితే.. ‘నాకు నటన అన్నా.. సినిమాలన్నా చాలా ఇష్టం. దానివల్లేనేమో ఇన్ని ప్రాజెక్టులు ఒక్కసారి చేస్తున్నా కష్టంగా అనిపించట్లేదు’అని జవాబిచ్చింది. ‘మొదటి సినిమా నుంచే మంచి బ్యానర్స్ లో అవకాశాలు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను పనిచేస్తున్న ప్రతి హీరో నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ప్రస్తుతం బాలీవుడ్ లో ఛాన్స్ ల కోసం ఆలోచించట్లేదు. అయినా, దానికి చాలా టైం ఉంది. ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే.. మంచి సినిమాలు చేశాననే సంతృప్తి కలగాలి. అప్పటివరకు సినిమాలను వదలను’అని చెప్పుకొచ్చింది

Updated : 14 Jun 2023 7:34 PM IST
Tags:    
Next Story
Share it
Top