బేబమ్మ అలా.. విజ్జి పాప ఇలా..
X
ఈ ఇద్దరు హీరోయిన్లూ ఏకకాలంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే మెప్పించారు. వీరిలో ఒక్కరు మాత్రమే టాలీవుడ్ కు కాబోయే కృతిశెట్టి తెలుగు తెరపైకి ఉప్పెనలా దూసుకువచ్చింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. దీంతో ఆ సినిమాలోని పేరుతో బేబమ్మ టాలీవుడ్ ను ఏలేస్తుంది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో మరో రెండు విజయాలు పడ్డాయి. ఇంకేం.. ఇక తనే టాలీవుడ్ నెంబర్ వన్ అవుతుందనుకున్నారు. ఇక్కడే అమ్మడికి హిట్ అడ్డం తిరిగింది. క్రేజ్ తగ్గ ఆఫర్స్ వచ్చినా.. అందుకు తగ్గట్టుగా సక్సెస్ లు రాలేదు. ద వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ అంటూ వరుసగా నాలుగు డిజాస్టర్స్. నిజానికి ఈ అన్ని సినిమాల్లోనూ తనవి వైవిధ్యమైన పాత్రలే. అయితేనేం.. హిట్ లేనప్పుడు ఎంత కొత్తదనం ఉన్నా ప్రేక్షకులు పట్టించుకోరు. ఆడియన్స్ కు నచ్చలేదంటే మేకర్స్ కు మాత్రం నచ్చుతుందా.. అందుకే చాలా వేగంగా తెలుగులో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం శర్వానంద్ తో చేస్తోన్న సినిమా మాత్రమే ఉంది. రవితేజ సరసన ఆఫర్ వస్తుందనుకుంటున్నారు. కానీ కన్ఫార్మ్ కాలేదింకా. వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా.. హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగులో స్టార్డమ్ లేని లోటు బేబమ్మలో కనిపిస్తుంది.
ఇక కృతిశెట్టికి భిన్నంగా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఫస్ట్ మూవీ పెళ్లి సందడి పెద్ద హిట్ టాక్ తెచ్చుకోలేదు. కానీ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. అందుకు ప్రధాన కారణం శ్రీ లీల ఛలాకీతనం అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించింది. సినిమా యావరేజ్ కావడంతో తను టాప్ ప్లేస్ కు వెళుతుందని ఎవరూ అనుకోలేదు. కాస్త ఆలస్యమైనా మాస్ మహరాజ్ సరసన ధమాకాలో ఆఫర్ అందుకుంది. ఈ మూవీలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ డబుల్ ఇంపాక్ట్ వేసింది. అంతే.. టాలీవుడ్ అంతా తనకోసం క్యూ కట్టింది. అందం, ప్రతిభ.. ఛలాకీదనం కలిసిన శ్రీ లీలకే జై అన్నారు యంగ్ స్టర్స్. ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కు పెయిర్ గా చేస్తోంది. రీసెంట్ గా వచ్చిన స్కంద యావరేజ్ అనిపించుకున్నా.. తను ఉన్న స్టేజ్ లో సాహసం చేస్తూ బాలయ్యకు కూతురుగా చేసిన భగవంత్ కేసరిలో అద్భుతమైన పాత్రలో ఆకట్టుకుంది. హీరోయిన్ గా టాప్ స్పీడ్ లో ఉన్న వాళ్లు ఈ తరహా పాత్రలు చేయడానికి సాహసించరు. బట్ శ్రీలీల ఈ విజయాన్ని ఊహించింది. దీంతో పాటు అప్లాజ్ కూడా యాడ్ అయింది. అందుకే టాప్ ప్లేస్ కు వెళుతూనే.. విజ్జి పాప అనే డిఫరెంట్ ఇమేజ్ ను కూడా అందుకుంది. తన చేతిలో ఇప్పుడు ఆదికేశవ్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. ఏదేమైనా కృతిశెట్టి బేబమ్మగానే మిగిలిపోతే.. ధమాకా లాంటి శ్రీ లీల విజ్జిపాపగానూ మెప్పిస్తూ దూసుకుపోతోంది. మరి శ్రీ లీలకు కృతిశెట్టి పోటీ ఇవ్వడం దాదాపు కష్టమే అని చెప్పాలి.