Home > సినిమా > SriDevi Death : శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు..సీబీఐ ఛార్జిషీట్‌

SriDevi Death : శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు..సీబీఐ ఛార్జిషీట్‌

SriDevi Death : శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు..సీబీఐ ఛార్జిషీట్‌
X

ప్రముఖ నటి శ్రీదేవి మృతిపై ఇన్వెస్టిగేషన్ చేశానంటూ తెలిపిన ఓ మహిళపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. తన దర్యాప్తునకు ఆధారాలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాల పేరుతో నకలీ ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్టు ఆరోపించింది. ఇన్వెస్టిగేటర్‌నంటూ తనకు తాను చెప్పుకొన్న భువన్వేర్‌కు చెందిన మహిళ దీప్తి రాణి పిన్నిటి, ఆమెకు సహకరించిన న్యాయవాది భరత్‌ సురేష్‌ కామత్‌పై చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు సీబీఐవర్గాలు పేర్కోన్నాయి. ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా ఫిర్యాదు మేరకు గతేడాది యూట్యూబర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వ రికార్డులతో పాటు ప్రధాని, రక్షణ మంత్రి లేఖలతో సహా పలు 'నకిలీ' పత్రాలను పిన్నిటి సమర్పించారని షా ఆరోపించారు.

ప్రముఖ బాలీవుడ్ నటీనటులు శ్రీదేవి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ల మరణంపై జరిగిన చర్చలకు సంబంధించి సోషల్ మీడియాలో పిన్నిటి యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్‌లో మరణించగా దీనిపై యూట్యూబ్‌లో జరిగిన చర్చలో ఆమె భాగస్వాములయ్యారు. శ్రీదేవి మరణాన్ని యునైటెడ్‌ ఎమిరేట్స్‌, భారత్‌ ప్రభుత్వాలు కలిసి కప్పిపుచ్చుతున్నాయని, ఇది తన ‘దర్యాప్తు’లో తేలిందని చెప్పారు. ఇందుకు ఆధారంగా మోదీ, అమిత్‌ షా పేరుతో ఉన్న నకిలీ లేఖలు చూపారు.శ్రీదేవి మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ అధికారులు తెలిపారు. శ్రీదేవి మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను డాక్టర్ల బృందం విడుదల చేసింది. ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడిపోవడం వల్లే శ్రీదేవి మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుస్తోందని యూఏఈ ఆరోగ్య శాఖ అప్పుట్లో తెలిపింది.

Updated : 5 Feb 2024 8:37 AM IST
Tags:    
Next Story
Share it
Top