ఈ స్టార్ హీరో కూతురును గుర్తుపట్టారా.. హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోలేదు
X
నటుల వారసులు దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా తల్లితండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటులే. కాకపోతే ఈమె కూడా నటి అవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్. కానీ చూస్తుంటే మాత్రం ప్రస్తుత హీరోయిన్లని మించిన అందం ఆమె సొంతం. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకుండానే అభిమానులను సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు బయట మీడియా కెమెరాలకు చిక్కుతూ.. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?
ఆ అమ్మాయి పేరు మేధ. టాలీవుడ్ హీరో శ్రీకాంత్, ఉహల కూతురు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. ఇప్పటికే రోషన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు రోహన్ ఇంకా చదువుకుంటున్నాడు. కూతురు మేధ.. చదువు పూర్తి చేసింది. ఇటీవలే శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి తిరుమ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ క్రమంలో గుడి దగ్గర మేధ.. కెమెరా కంటికి చిక్కింది. కాసేపు ఎవరా అని ఆలోచించిన అభిమానులు.. మేధ అని తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. కాగా ఆ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను చూసిన అభిమానులు.. మేధ ఒకవేళ ఇండస్ట్రీలోకి వస్తే.. మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు.