Home > సినిమా > సౌత్ దేవాలయాలను చుట్టబెట్టిన రాజమౌళి అండ్ ఫ్యామిలీ

సౌత్ దేవాలయాలను చుట్టబెట్టిన రాజమౌళి అండ్ ఫ్యామిలీ

సౌత్ దేవాలయాలను చుట్టబెట్టిన రాజమౌళి అండ్ ఫ్యామిలీ
X

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి ఇంకా ఏ సినిమా మొదలెట్టలేదు. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినా ప్రీ పొడక్షన్ పనుల్లోనే ఉన్నారు. ఈలోపు రాజమౌళి ప్రపంచం చుట్టబెడుతున్నారు. మూడు నెలలు విదేశాల్లో తిరిగొచ్చిన ఆయన వెంటనే సౌత్ లో ఉన్న దేవాలయాలన్నీ చుట్టుబెట్టారు. దీని మీద ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా చిరకాల కోరిక నెరవేరింది అంటూ రాసుకొచ్చారు.

తమిళనాడు, కర్ణాటకల్లోని దేవాలయాలకు రాజమౌళి ఓ రౌండ్ వేశారు. కుటుంబసమేతంగా శ్రీరంగం, బృహదీశ్వరాలయం,రామేశ్వరం, కనడుకథన్, తూత్తుకుడి, మధురై చూసివచ్చారు. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలతో ఒక వీడియోను చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. ఈ ట్రిప్ ప్లాన్ అంతా వాళ్ళ అమ్మాయి చేసిందట. అందుకే ఆమెకు జక్కన థాంక్స్ కూడా చెప్పారు.

సౌత్ లో దేవాలయాలు ఒక అద్భుతమన్నారు రాజమౌళి. వాటిల్లోని శిల్పకళ చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. చోళుల కాలంలోనే ఎంతో గొప్ప ఇంజనీర్లు ఉన్నారని జక్కన పొగిడారు. కుంభకోణంలో కాక హోటల్, రామేశ్వరంలోని మురుగదాస్ హోటల్ లో భోజనం ఎంతో రుచిగా ఉన్నయని కూడా అన్నారు. వారంలోనే తాను 3 కిలోలు పెరిగానని వ్యాఖ్యానించారు. మన దేశంలోని ఇలా పుణ్యక్షేత్రాలను సందర్శించడం తనకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.అయితే ట్విట్టర్ లో ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు మహాభారతం తీయడం కోసమే దేవాలయాలను సందర్శిస్తున్నారా అంటూ రాజమౌళిని ప్రశ్నలు అడుగుతున్నారు. మహేష్ సినిమా అయిన తర్వాత మహాభారతం డ్రీమ్ ప్రెజెక్ట్ మొదలుబెడతామని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పారు.

Updated : 11 July 2023 5:00 PM IST
Tags:    
Next Story
Share it
Top