Home > సినిమా > తండ్రితో రాజీకొచ్చిన స్టార్ హీరో..ఆ గొడవలకు ఫుల్‌స్టాప్‌

తండ్రితో రాజీకొచ్చిన స్టార్ హీరో..ఆ గొడవలకు ఫుల్‌స్టాప్‌

తండ్రితో రాజీకొచ్చిన స్టార్ హీరో..ఆ గొడవలకు ఫుల్‌స్టాప్‌
X

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ కోట్లు గడిస్తున్నాడు. ప్రొఫెషనల్ విషయాలను కాస్త పక్కన పెడితే..తాజాగా విజయ్‌ పర్సనల్ విషయానికి సంబంధించి ఓ అప్‎డేట్ ఆయన ఫ్యాన్స్‎ను ఫుల్ ఖుష్ చేస్తోంది. విజయ్‎కి ఆయన తండ్రి చంద్రశేఖర్‌కు మధ్య విబేధాలు ఉన్నాయని అందుకే విజయ్ తన తండ్రిని కలిసేందుకు వెళ్లడని ఎప్పటినుంచో పుకార్లు వస్తున్నాయి. అయితే అప్పట్లో విజయ్‌‎ పేరు మీద ఆయన తండ్రి ఓ పొలిటికల్ పార్టీ పేరుతో కార్యాలయం పెట్టడం విజయ్‎కి నచ్చలేదట. ఈ విషయంలో కన్న తండ్రిపైనే విజయ్ పోలీస్ కేసు పెట్టాడు. దీంతో అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ గొడవ గురించి ఈ ఇద్దరూ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఈ క్రమంలో ఛాన్నాళ్ల తరువాత విజయ్ తన తండ్రిని కలిశాడు. ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ తండ్రి చంద్ర శేఖర్‌ గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్నారు. దీంతో పాత గొడవలను, పంతాలను పక్కన పెట్టి విజయ్‌ తండ్రితో రాజీకొచ్చాడు. తన తండ్రిని కలిసి ఆయన యోగక్షేమాలను విజయ్ తెలుసుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత కొడుకు ఇంటికి రావడంతో విజయ్ తల్లి శోభా తనకు నచ్చిన రుచికరమైన వంటకాలను రెడీ చేయించారట. ఈ మధ్యనే అమెరికా వెళ్లిన విజయ్‌ తండ్రి సర్జరీ గురించి తెలియడంతో చెన్నై వచ్చిన వెంటనే ఆయన్ని కలవడానికి వచ్చాడు. ఇదే సమయంలో తల్లితో కలిసి ఫోటోలు దిగాడు విజయ్. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతె విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఈ మధ్యనే విజయ్ వారసుడు సినిమా చేశారు. ఈ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ గురించి విజయ్ మాట్లాడినప్పుడు..అందరూ ఆయన్ని విమర్శించారు. రియల్ లైఫ్‎లో తండ్రిని, తల్లిని పక్కన పెట్టాడని ఆయన్ని తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఫోటో దిగి ట్రోలర్స్‎కు , రూమర్స్‎కు చెక్ చెప్పాడు విజయ్. ప్రస్తుతం విజయ్ లియో సినిమా చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‎లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ లియోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ అక్టోబర్ 19న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లన్ చేస్తున్నారు.

Updated : 14 Sept 2023 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top