Home > సినిమా > పుష్పకు నో చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

పుష్పకు నో చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

పుష్పకు నో చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

చిత్ర పరిశ్రమలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా హీరోల ఎంపికలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక హీరోను ఊహించుకుని కథ రాస్తే వేరే హీరో నటించడం.. ఆ సినిమా కాస్త బ్లాక్ బస్టర్ అవ్వడం హీరోకు స్టార్ ఇమేజ్‎ను తీసుకురావడం చాలా సందర్భాల్లో చూసుంటాం. అయ్యయ్యో ఆ సినిమా ఎందుకు మిస్ చేసుకున్నాని హీరోలు ఫీల్ అయిన సందర్భాలు లేకపోలేదు. గత ఏడాది విడుదలై దేశవ్యాప్తంగా దుమ్ము దులిపిన పుష్పలో నిజానికి అల్లు అర్జున్‎ను ముందుగా హీరోగా అనుకోలేదట సుకుమారు. పుష్ప సినిమాను ఓ స్టార్ హీరోను ఊహించుకుని రాశాడట. అయితే కథంతా విన్న ఈ స్టార్ హీరో నాకు సెట్ అవ్వదని సున్నితంగా తిరస్కరించాడట. ఇప్పుడేమో ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో..ఏమా కథ అనుకుంటున్నారా..చూద్దాం పదండి.




క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‏లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం పుష్ప దేశవ్యాప్తంగా ఎంతటి హిట్ సాధించిందో అందరికీ బాగా తెలుసు. భారీ వసూళ్లను రాబట్టడమే కాదు ఈ సినిమాతో అల్లు అర్జున్‎కు పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. నిజానికి ఈ సినిమా స్టోరీని సుకుమార్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాశాడట. ఈ సినిమాకు మహేష్ కరెక్ట్‎గా సెట్ అవుతాడని భావించాడట. కథ పూర్తి కాగానే మహేష్ దగ్గరికి వెళ్లి వివరించాడు సుకుమార్. కానీ ఆ మాస్ లుక్ తనకు సెట్ కాదని మహేష్ కూల్‎గా రిజెక్ట్ చేశాడట. దీంతో సుకుమార్ ఐకానిక్ స్టార్ బన్నీకి స్టోరీ వినిపించాడట. కథ తనకు కనెక్ట్ అవ్వడంతో బన్నీ సినిమాకు ఓకే చెప్పేశాడు. దీంతో సుకుమార్ బన్నీ ఎనర్జీకి తగ్గట్లుగా కథలో కొన్ని మర్పులు చేసి సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. వెండితెర మీద పుష్ప చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ కథకు ఫుల్ మార్కులు పడ్డాయి. బన్నీతనదైన శైలిలో అత్యద్భుతంగా నటించాడు. సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది.

Updated : 7 Jun 2023 4:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top