పేర్లు మారిపోయాయ్.. బడా హీరోల స్టార్ నేమ్స్ చేంజ్
X
టాలీవుడ్‌లో హీరోలంతా పాన్ ఇండియా స్టార్లుగా మారుతున్నారు. బడా హీరోలు ఓ పాన్ ఇండియా మూవీ చేస్తే చాలు వారి ముందు ట్యాగ్స్ మారిపోతున్నాయి. తాజాగా ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో అలాంటిదే జరుగుతోంది. ఆ మధ్యన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ట్యాగ్స్ మార్చేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా ఎన్టీఆర్ మారిపోతే గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ ట్యాగ్‌ను సెట్ చేసుకున్నాడు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేశాక గ్లోబల్ లెవల్లో చరణ్‌కు పేరొచ్చింది. దీంతో ఆయన గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈమధ్యనే స్టార్ట్ అయిన ఆర్సీ16 మూవీలో కూడా ఆయన తన పేరుపై గ్లోబల్ స్టార్ అనే వేయించుకున్నాడు. మెగా పవర్ స్టార్ అనే పేరు కాస్తా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యింది.
ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పిలిపించుకున్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఆయనకు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. దీంతో ఈ మధ్యనే ప్రారంభమైన దేవర మూవీలో తారక్ తన పేరుకు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే వేయించుకున్నాడు. ఇక పుష్ప మూవీతో రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ అని అనిపించుకున్నాడు.
పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవల్లో మరింత హైప్ వచ్చింది. దీంతో ఆయనకు ఐకాన్ స్టార్ అనే ట్యాగ్‌ను డైరెక్టర్ సుకుమార్ ఇచ్చారు. దీంతో పుష్ప మూవీ తర్వాత వచ్చే పుష్ప2లో అల్లు అర్జున్ తన పేరుకు ముందు ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నాడు. మొత్తానికి ఈ ముగ్గురు స్టార్లు తమ కొత్త ట్యాగ్స్‌తో దూసుకుపోతున్నారు.