Home > సినిమా > OTT Cinema: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఒకేరోజు నాలుగు సినిమాలు

OTT Cinema: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఒకేరోజు నాలుగు సినిమాలు

OTT Cinema: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్..  ఒకేరోజు నాలుగు సినిమాలు
X

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్. సంక్రాంతి వేళ థియేటర్లలో అలరించిన స్టార్ హీరోల సినిమాలన్నీ రాబోయే 10 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలూ చూద్దామా అని ఎదురుచూసే మూవీ లవర్స్‌కు ఇది కచ్చితంగా కిక్ ఇచ్చే న్యూసే. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి భాగానే ఆదరణ వస్తోంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3న రిలీజ్ చేశారు. తండ్రికూతుళ్ల సెంటిమెంట్ ఉండడంతో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు.

ఇక ఈ వారం ఫిబ్రవరి 9న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం(Mahesh Babu's Guntur Kaaram) సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు థియేటర్స్ లో యావరేజ్ టాక్ వచ్చింది. అయితే తల్లీకొడుకుల అనుబంధం, స్థానిక రాజకీయం, ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి ఓటీటీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్(Dhanush captain miller) కూడా ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మూడు భాగాలుగా కెప్టెన్ మిల్లర్ తీయాలని అనుకున్న డైరెక్టర్ కి మొదటి సినిమాని నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో సీక్వెల్ కి ఫుల్ స్టాప్ పడినట్లే. ఓటీటీలో ఆడియన్స్ ని ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ( Nagarjuna's Naa Saami Ranga) మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక మూవీని ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి హాట్‌స్టార్ సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర నా సామిరంగ మూవీ రన్ దాదాపు ముగిసింది. దీంతో మూవీ థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకురానున్నారు. నా సామిరంగ సంక్రాంతికి ఒక రోజు ముందు అంటే జనవరి 14న రిలీజైంది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. హనుమాన్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీ నా సామిరంగనే. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లతో మొదలుపెట్టిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా తగ్గలేదు.

శివకార్తికేయాన్ అయలాన్(sivakarthikeyan's ayalaan) మూవీ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 16 న రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ గా ఓటీటీలో మూవీని స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కన్నడంలో దర్శన్ హీరోగా తెరకెక్కిన కతేరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ జీ5లో ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

Updated : 6 Feb 2024 9:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top