Home > సినిమా > జాతీయ ఉత్తమ నటుడితో జత కట్టనంటున్న ఆ హీరోయిన్లు

జాతీయ ఉత్తమ నటుడితో జత కట్టనంటున్న ఆ హీరోయిన్లు

జాతీయ ఉత్తమ నటుడితో జత కట్టనంటున్న ఆ హీరోయిన్లు
X

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‎లో వచ్చిన పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని తన మాస్ పెర్ఫార్మెన్స్‎తో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు రీసెంట్‎గా నిర్వహించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‎లో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‎ని బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. ఈ సినిమాతో ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు లభించని గౌరవాన్ని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్‎లో బిజీ బిజీగా ఉన్నాడు. సీక్వెల్‎లో బన్నీ క్యారెక్టర్ మరింత రస్టిక్ గా డిజైన్ చేసాడు డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీలో రష్మిక మందన బన్నీకి జోడీగా నటిస్తుండగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పుష్ప 2 కు సంబంధించి దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయింది. వచ్చే ఏడాది వెండితెరమీద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అభిమానులు సైతం సినిమా కోసం వేయి కళ్లతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.





ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‎లో కనిపించింది. ఈ పాట దేశం మొత్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊ అంటావా మామ ఊహూ అంటావా అంటూ ఓ రేంజ్‎లో ఊగిపోయింది .అన్ని భాషల్లోనూ ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. దేవీశ్రీ అందించిన బీట్ , ఇంద్రావతి పాటకు సామ్ పవర్‎ఫుల్ స్టెప్పులు వేసి యూత్‎కు పిచ్చెక్కించింది. ఇప్పుడు పుష్ప -2 లోనూ ఇలాంటి స్పెషల్ సాంగ్‎నే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్‎లో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సాంగ్ కోసం ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోయిన్లను సంప్రదించగా వారు సింపుల్‎గా రిజెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరో నటి రెమ్యునరేషన్ కారణంగా ఆఫర్‎ను వద్దనుకుందట. మరో హీరోయిన్ ప్రత్యేక కారణాల వల్ల స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్‎ను వదులుకుందని ప్రచారం నడుస్తోంది. నేషనల్ అవార్డ్ వచ్చిన ఆనందంలో ఉన్న బన్నీకి ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు. మరి పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే లక్కీ ఛాన్స్‎ను ఎవరు సొంతం చేసుకుంటారో అన్న ఆసక్తి మాత్రం అందరిలో నెలకొంది .ఇదిలా ఉంటే..పుష్ప2 సినిమాలో ఇంటర్వెల్ , క్లైమాక్స్ ట్విస్ట్ లు అద్భుతంగా ఉండనున్నాయని అంటున్నారు . పుష్ప2 సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండనుందని టాక్. పుష్ప2 సినిమా కలెక్షన్లు వేయి కోట్ల రూపాయలు దాటుతాయన్న అంచనాలు ఉన్నాయి . అలాగే పుష్ప -2 పై పలు రకాల ప్రచారాలు ఉన్నాయి.. మూవీ విడుదల అయితే కానీ వాటికి సమాధానం దొరికే ఛాన్స్ లేదు.




Updated : 29 Aug 2023 11:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top