మా జోలికి వస్తే ఊరుకోను..రాకేశ్ మాస్టర్ కొడుకు ఆగ్రహం
X
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఈమధ్యనే అనారోగ్య సమస్యలతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శిష్యులు, ఫాలోవర్లు, అభిమానులు, నెటిజన్లు రాకేశ్ మాస్టర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాకేశ్ మాస్టర్ కొడుకు తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మా నాన్నకు ఇలాంటి పరిస్థితి రావడానికి సోషల్ మీడియానే కారణమని, ఆయన గురించి ఇక మాట్లాడటం ఆపేయాలని చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కన్నా సోషల్ మీడియా ద్వారానే ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఆయన నెట్టింట్లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్ ఛానల్స్‌లో నిర్మొహమాటంగా, నిర్భయంగా తన అభిప్రాయాలను చెబుతూ, తోటి డ్యాన్స్ మాస్టర్లపైన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకుని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుండేవారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తన తండ్రిని వారి సొంత లాభం కోసం వినియోగించుకున్నాయని, మాస్టారును బ్యాడ్ లైట్లో చూపించారని చరణ్ తాజాగా ఆరోపణలు చేస్తున్నాడు. సోషల్ మీడియా కారణంగానే మా నాన్న ఇలా అయిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలని ఇకపై యూట్యూబ్ ఛానళ్లు మాస్టార్ గురించి కానీ తమ ఫ్యామిలీ గురించి కానీ వీడియోలను చేయడం ఆపేయాలని హెచ్చరిస్తున్నాడు. మా బాధను చూపించి మా జీవితాలను మరింత అంధకారం చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మా గురించి ఎలాంటి వీడియోలు వచ్చినా వెంటనే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.