Home > సినిమా > సౌత్ లో మరో క్రేజీ మల్టీస్టారర్

సౌత్ లో మరో క్రేజీ మల్టీస్టారర్

సౌత్ లో మరో క్రేజీ మల్టీస్టారర్
X

కొన్ని కాంబినేషన్స్ కు తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కూడా షాక్ అయ్యేలా అదే కాంబో నుంచి మల్టీస్టారర్ అనౌన్స్ అయితే ఎలా ఉంటుంది...? యస్.. ఇప్పుడు అలాంటి ఓ భారీ మల్టీస్టారరే సౌత్ నుంచి అనౌన్స్ అయింది. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడైన సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా ఓటిటిలోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలు ఉన్నాయి. ఆ వార్తలను కన్ఫార్మ్ చేస్తూనే సర్ ప్రైజింగ్ గా భారీ మల్టీస్టారర్ గా ఈ మూవీని ప్రకటించారు

సూర్య.. తమిళ్ స్టార్ అయినా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో. ముఖ్యంగా తెలుగులో అతనికి తిరుగులేని మార్కెట్ కూడా ఉంది. ఏ పాత్ర అయినా చేయగల ప్రతిభావంతుడు. స్టార్డమ్ ను క్యారీ చేస్తూనే వైవిధ్యమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఆ క్రమంలో చేసిన ఆకాశం నీ హద్దురా అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం కంగువా అనే ఫాంటసీ థ్రిల్లర్ తో రాబోతోన్న సూర్యతో సుధా కొంగర మరో సినిమా చేస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. రీసెంట్ గా సుధ.. ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని హిందీలో రూపొందించింది. ఇక సూర్య మూవీ అనౌన్స్ చేస్తూ ఇదో భారీ మల్టీస్టారర్ అని చెప్పడం.. ఆ మల్టీస్టార్స్ లో దుల్కర్ సాల్మన్ ఉండటం ఎంటైర్ సౌత్ ను ఎగ్జైట్ చేస్తుంది. దుల్కర్ కూ దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. తెలుగులో క్రేజ్ ఉంది. అసలు సూర్య, దుల్కర్ కలిసి నటిస్తున్నారు అనే మాటే ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. వీరితో పాటు నజ్రియా నజ్రీన్ ఫీమేల్ లీడ్ చేస్తుండగా.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని అనౌన్స్ చేసింది టీమ్. ఈ మూవీని సూర్యనే నిర్మిస్తుండటం విశేషం అయితే.. టాలెంటెడ్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కు ఇది వందవ సినిమా కావడం మరో విశేషం. ఏదేమైనా.. సౌత్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ తర్వాత అంతటి ఎగ్జైటింగ్ మల్టీస్టారర్ గా ఈ చిత్రాన్నే చెప్పాలి.


Updated : 26 Oct 2023 4:34 PM IST
Tags:    
Next Story
Share it
Top