Home > సినిమా > Book my Show:బుక్ మై షోపై కేసు నమోదు.. సన్ బర్న్ ఈవెంట్ రద్దు

Book my Show:బుక్ మై షోపై కేసు నమోదు.. సన్ బర్న్ ఈవెంట్ రద్దు

Book my Show:బుక్ మై షోపై కేసు నమోదు.. సన్ బర్న్ ఈవెంట్ రద్దు
X

హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌ బర్న్‌ ఈవెంట్‌ రద్దయింది. ఈ ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అదే సమయంలో సన్‌బర్న్‌ ఈవెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌ అయిన తర్వాత, బుక్‌ మై షో సంస్థ టికెట్‌ విక్రయాలు నిలిపేసింది. అనుమతి లేకుండానే, టికెట్లను విక్రయించినందుకు బుక్‌ మై షోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. ఇప్పటికే బుక్ మై షో, సన్ బర్న్ నిర్వహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. Yolo arena లో బుక్ చేసుకున్న సన్ బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. పోలీస్‌ కేస్‌ తర్వాత, బుక్‌ మై షోలో హైదరాబాద్‌ ఈవెంట్‌ కనిపించలేదు.

డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపుతామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటనతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. న్యూ ఇయర్‌ ముసుగులో జరిగే ఈవెంట్స్‌పైనా నిఘాపెట్టాలన్న రేవంత్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా స్పీడ్‌ పెంచింది. వెంటనే, న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. టికెట్లు అమ్మి ఈవెంట్లు నిర్వహించే సన్‌బర్న్‌, బుక్‌మైషో వంటి సంస్థలకు పోలీస్‌ శాఖ అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్‌ సీపీ మహంతి తేల్చేశారు. సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. తాజాగా పోలీసుల కేసుతో సన్‌బర్న్‌ ఈవెంట్‌ రద్దయింది.

Updated : 26 Dec 2023 11:49 AM IST
Tags:    
Next Story
Share it
Top