Home > సినిమా > Gadar 2 collection : రూ.300 కోట్ల క్లబ్లో గదర్ -2.. మరో సీక్వెల్కు రెడీ అయిన సన్నీ..!

Gadar 2 collection : రూ.300 కోట్ల క్లబ్లో గదర్ -2.. మరో సీక్వెల్కు రెడీ అయిన సన్నీ..!

Gadar 2 collection : రూ.300 కోట్ల క్లబ్లో గదర్ -2.. మరో సీక్వెల్కు రెడీ అయిన సన్నీ..!
X

సన్నీడియోల్ ప్రధాన పాత్ర పోషించిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా రెండు దశాబ్దాల క్రితం తెరకెక్కిన గదర్ - ఏక్ ప్రేమ్ కథా సినిమాకు సీక్వెన్స్గా గదర్ 2 నిర్మించారు. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ఈ మూవీ మొత్తం రూ.305.13 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. గదర్ - 2 మరో వారం రోజుల్లో సరికొత్త రికార్డును బద్దలు కొడుతుందని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.





ఇదిలా ఉంటే గదర్ - 2ఇచ్చిన జోష్తో సన్నీ డియోల్ మరో సీక్వెల్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 1971 లోంగేవాలా యుద్ధం ఇతివృత్తంగా 1997లో తెరకెక్కిన బోర్డర్ సినిమాకు సీక్వెల్ గా బోర్డర్ - 2 సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. నిజానికి నిర్మాత, దర్శకుడు జేపీ దత్తా నిర్మించిన బోర్డర్ మూవీ సీక్వెల్ కోసం ఏండ్లుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ పట్టాలెక్కలేదు. తాజాగా గదర్ - 2కు వచ్చిన రెస్పాన్స్ చూసి త్వరలోనే బోర్డర్ -2ను పట్టాలెక్కించాలని నిర్ణయించిన జేపీ దత్తా దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది.

బోర్డర్ - 2 సీక్వెల్ ను జేపీ దత్తాతో పాటు ఆయన కూతురు నిధి దత్తా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మూవీకి సంబంధించి త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. 1971 లోంగేవాలా వార్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బోర్డర్ మూవీలో సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, కుల్ భూషణ్ కర్బందా, సుదేశ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. తాజాగా వస్తున్న సమాచారం మేరకు బోర్డర్ - 2 సీక్వెల్లో సన్నీ డియోల్ మినహా మిగతా నటులంతా కొత్తవారే ఉంటారని టాక్ వినిపిస్తోంది.




Updated : 19 Aug 2023 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top