Sunny Leone : బుల్లితెర యాంకర్‌గా సన్నీ లియోన్.. ప్రోమో రిలీజ్
X
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చేసిన సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ఛానల్స్‌లొ ఆమె షేర్ చేసే ఫోటోలు , వీడియోలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అందాల నటి.. తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించింది. ఆమె జీ తెలుగు కోసం ‘తెలుగు మీడియం స్కూల్’ అనే కొత్త రియాలిటీ షోను హోస్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను ఈ ఛానల్ విడుదల చేసింది.
ప్రోమో లో.. తెలుగు తనకు జీవితాన్ని ఇచ్చిందని చెప్పింది. తెలుగును ఎంటర్‌టైన్మెంట్‌తో సెలబ్రేట్ చేసుకుందామంటూ.. ఈ రియాల్టీ షో నెవర్ బిఫోర్ అంటూ అందర్నీ ఆకర్షించింది. ఈ ప్రోమోలో సన్నీలియోన్‌తో పాటు ప్రముఖ గాయకుడు మను, యాంకర్ రవి కూడా సందడి చేశారు. అంతేకాకుండా ఇందులో టాలీవుడ్ హాస్య నటులు కూడా ఉన్నారు. 33 సెకన్లు ఉన్న ఈ వీడియోలో సన్నీ టీచర్ గెటప్‌లో.. గులాబీ రంగు చీరలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. తొలిసారిగా ఆమె చేస్తున్న తెలుగు రియాల్టీ షో కావడంతో.. అందరూ ఆమెకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
అయితే, రియాలిటీ షో విషయంలో ఖచ్చితమైన క్లారిటీ ఇంకా తెలియలేదు. ఈ షో కాన్సెప్ట్ ఎంటి అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు ఈ బ్యూటీ సుమ, రష్మి, అనసూయ, శ్రీముఖి వంటి వారిని కొల్లగొట్టడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందట 'జిస్మ్ 2' అనే బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో 'కరెంట్ తీగ, గరుడ వేగ,జిన్నా' సినిమాల్లో కూడా నటించింది.