3 నెలలు బ్యాంకాక్‌కు మహేష్ బాబు..రాజమౌళి సినిమా లేటెస్ట్ అప్డేట్..
X
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, మహేష్ బాబు పోకిరి సినిమాలోని డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. కేవలం సినిమాల్లోనే ఈ డైలాగ్ వర్తించదు. రియల్ లైఫ్‌లోనూ మహేష్ బాబు ఇదే పాలో అవుతుంటాడు. ఒక్కసారి ఓ సినిమాకు కమిట్ అయ్యాడంటే చాలు దాని కోసం ఏమైనా చేసేందుకు రెడీ అంటాడు. ఎక్కడికైనా వెళ్లేందుకు ముందుంటాడు. సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు తనను తాను ప్రజెంట్ చేసుకోవడంలో ఎప్పుడూ వెనకడుగువేయడు. నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అవసరమైతే, కథ డిమాండ్ చేస్తే కొత్త కళలను కూడా అభ్యసించేందుకు సిద్ధమవుతుంటాడు. తాజాగా మహేష్ జక్కన్న సినిమా SSMB29 కోసం ఇంత వరకు నేర్చుకోని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రిన్స్ మూడు నెలల పాటు బ్యాంక్‌కాక్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకాంగ్‌కు వెళ్లి.. ఓ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ దగ్గర ట్రైనప్ అవనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ జోరుగా వినిపిస్తోంది. దీంతో ఈ క్రేజీ న్యూస్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా గర్వించేలా అత్యద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాడంటే దాని వెనకాల ఎంతో శ్రమ , కృషి, ప్లాన్ ఉందని చెప్పాల్సిందే. ఈ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. హాలీవుడ్ రేంజ్లో SSMB29 ఉంటుందని హింట్ కూడా ఇచ్చేశాడు.
భారీ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు మహేష్ మాత్రమే న్యాయం చేస్తాడని ఇప్పటికీ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు.
మరికొద్దిరోజుల్లో చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న తరుణంలో తాజాగా మూడు నెలల పాటు మహేష్ బ్యాంకాక్ కు వెళ్లనున్నారంటూ మరో క్రేజీ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రాజమౌళి చిత్రం భారీ అడ్వెంచర్ ఫిల్మ్ కావడంతో యాక్షన్, స్టంట్స్‌కు సంబంధించిన సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆ సీన్స్‌ను అద్భుతంగా పండించేందుకు మహేష్ బాబు స్పెషల్ ట్రెయినింగ్ తీసుకోబోతున్నారంట. అది కూడా బ్యాంకాక్ లో ..ఇంటర్నేషనల్ ట్రైనర్ దగ్గర 90రోజుల పాటు స్పెషల్‌గా శిక్షణ పొందనున్నాడని సమాచారం. కేవలం అడ్వాన్స్ మార్షల్ ఆర్ట్స్ లో మాత్రమే కాదు రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి వాటిలోనూ శిక్షణ పొందనున్నారని టాక్. అసలే మహేష్ బాబు ఇప్పటికీ కుర్ర హీరోలు కుళ్లుకునేలా ఉంటాడు. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం జిమ్ బాడీలో కనిపించేందుకు తన శరీరాన్ని ఉక్కులా మార్చేసుకుంటున్నాడు. అందుకోసం నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బీస్ట్ అవతార్ లోకి మారిపోతున్నాడు. ఇక అడ్వాన్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం త్వరలో బ్యాంకాక్ కూడా వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది.