జవాన్‌పై మహేశ్ బాబు రివ్యూ..షారుక్ గురించి ఏమన్నాడంటే...
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పాన్ ఇండియా మూవీ జవాన్ థియేటర్లలో విడుదలై విజయవంతంగా దూసుకెళ్తోంది. మూవీ రిలీజ్ అయిన తొలిరేజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు షారుక్ సినిమాకు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీలు సైతం జవాన్ సినిమాను పొగడ్తలతో ముంచేస్తున్నారు. తాజాగా ఈ మూవీ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. విడుదలైన రోజే తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు మహేశ్. ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసి జవాన్‌పై తన అభిప్రాయాన్ని తెలిపారు. మహేశ్ బాబు జవాన్‌కు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చారు.
" జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ . డైరెక్టర్ అట్లీ కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. షారుక్ ఖాన్ తన సినీ కెరీర్‌లోని బెస్ట్ మూవీస్‌లో జవాన్ కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలో షారుక్ పెర్ఫార్మెన్స్ అదుర్స్. తన యాక్టింగ్‌తో సినీ లవర్స్‌ను ఆకట్టుకున్నారు. కచ్చితంగా జవాన్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుంది’’ అని మహేశ్ ట్విటర్ వేదికగా జవాన్‌పై బ్లాక్ బస్టర్ రివ్యూ అందించారు. అంతే కాదు కింగ్ ఖాన్‌ను లెజెండ్ అని సంభోదించి పొగడ్తలతో ముంచేశారు.