జైలర్ రిలీజ్ రోజే రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం
X
సూపర్‌స్టార్ రజనీకాంత్ నాలుగేళ్ల తరువాత హిమాలయ టూర్‌కు స్టార్ట్ అయ్యారు. నెల్సన్ డైరెక్షన్లో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్’ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. సీనియర్ నటులు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలను పోషించారు. సాధారణంగా తన మూవీ రిలీజ్ అయ్యే సమయంలో హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు పరిపాటి. అదే అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్. అందుకే జైలర్ సినిమా రిలీజ్ ఉండటంతో ఆయన హిమాలయాలకు పయనమయ్యారు. రజనీకాంత్ ఈ ఏజ్‌లోనూ ఎంతో ఉత్సాహంగా హిమాలయాలకు వెళుతుండటంతో ఫ్యాన్స్ ఆయన ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు.
రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆ విషయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో తాత్వికత కనిపిస్తుంటుంది. ఆ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ సంవత్సరం హిమాలయాలకు వెళ్తుంటారు. అక్కడి నిర్మలమైన, ఆహ్లాదకరమైన, సుందరమైన ప్రకృతిలో కొన్ని రోజులు ఏకాంతంగా గడుపుతారు. అయితే కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన హిమాలయాలకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో జైలర్ రిలీజ్ సమయంలో ఆయన హిమాలయా యాత్రకు పయనమయ్యారు. సుమారు ఓ వారం రోజులు ఆయన హిమాలయాల్లోనే గడపనున్నారని తెలుస్తోంది.