Home > సినిమా > తలైవర్ 171 ఫస్ట్ లుక్ రిలీజ్..లోకేష్ కాన్సెప్ట్ అదేనా?

తలైవర్ 171 ఫస్ట్ లుక్ రిలీజ్..లోకేష్ కాన్సెప్ట్ అదేనా?

తలైవర్ 171 ఫస్ట్ లుక్ రిలీజ్..లోకేష్ కాన్సెప్ట్ అదేనా?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీతో భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 170వ మూవీని డైరెక్టర్ వెట్టియాన్ TJ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. అయితే రజినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ మాత్రం 171వదే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. లోకేష్ సినిమాలంటే భారీ అంచనాలుంటాయి. ఇక సినిమాటిక్ యూనివర్స్‌లో లోకేష్ చేస్తున్న మూవీస్‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పుడు ఆ యూనివర్స్‌లోనే రజినీకాంత్ మూవీ రానుంది. అందుకే ఈ మూవీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా నేడు రజినీకాంత్, లోకేష్ కాంబోలో వస్తున్న తలైవర్ 171వ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో రజినీకాంత్‌ను గోల్డ్ వాచ్‌లతో సంకెళ్లు వేసినట్టు చూపించారు. విలన్ నవ్వే నవ్వుతో రజినీకాంత్ కనిపిస్తున్నాడు. పోస్టర్ వెనక కూడా ఓ వాచ్ ఉంది.

తలైవర్ 171 సినిమా టైటిల్‌ని ఏప్రిల్ 22న ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు రజిని కొత్త సినిమా టైటిల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Updated : 28 March 2024 7:28 PM IST
Tags:    
Next Story
Share it
Top