రజనీకాంత్ సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
X
సినిమాల్లోకి రాకముందు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ బస్ కండక్టర్‌గా పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. నటన మీద ఉన్న ఆసక్తితో తన టాలెంట్ ప్రదర్శించి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు. తన నటన, స్టైల్‌తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆయన. సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే రజనీకాంత్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. అందుకే ఆయన్ను ప్రజలు ప్రేమగా తలైవా అని పిలుస్తారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే విడుదలైన జైలర్ సినిమా తరువాత హిమాలయాలకు వెళ్లారు రజనీకాంత్. అక్కడ పుణ్యక్షేత్రాలను సందర్శించి కాస్త విరామం తీసుకున్నారు. మళ్లీ తమిళనాడు చేరుకున్న ఆయన తాజాగా తలైవా తాను కండక్టర్‌గా పనిచేసిన డిపోకి వెళ్లారు. అక్కడి వాళ్లందరితో సరదాగా గడిపారు. సూపర్ స్టార్ అయినప్పటికీ ఓ సాదారణ వ్యక్తిలా అందరిని ఆప్యాయంగా పలకరించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని ఈ సంఘటనతో ఆయన మరోసారి నిరూపించారు.
రజనీకాంత్ బెంగళూర్‌లోని బీఎంటీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేశారు. ఆ తొలి జీవిత జ్ఞపకాలను నెమరవేసుకునేందుకు అదే స్టేషన్‌కు ఆయన వెళ్లారు. అక్కడ పనిచేసే బస్ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వారితో సరదాగా గడిపారు. అంతే కాదు అడిగిన వారికి కాదనకుండా సెల్ఫీలు ఇచ్చారు. ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తలైవా బస్ డిపోలో కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తమ అభిమాన హీరో ఇలా వచ్చారని తెలియడంతో ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో డిపోకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా రజనీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘నిజమైన తలైవా’ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఈ మధ్యనే విడుదలైన రజనీకాంత్ సినిమా ‘జైలర్’ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.ఇదే క్రమంలో జైలర్ సీక్వెల్ కూడా రానుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్యనే రజనీకాంత్ తన కూతురి డైరెక్షన్లో వస్తోన్న ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అదే విధంగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రజనీ. లైకా ప్రోడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.