Home > సినిమా > బద్రీనాథ్‌లో రజనీకాంత్‌.. ఫ్యాన్స్‎తో చిట్ చాట్

బద్రీనాథ్‌లో రజనీకాంత్‌.. ఫ్యాన్స్‎తో చిట్ చాట్

బద్రీనాథ్‌లో రజనీకాంత్‌.. ఫ్యాన్స్‎తో చిట్ చాట్
X

సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాల టూర్ విజయవంతంగా సాగుతోంది. ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నసూపర్ స్టార్ తాజాగా ఉత్తరాఖండ్‎లోని బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నన రజనీకాంత్ స్వామివారికి పూజలు చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. రజనీకాంత్ కూడా ఫ్యాన్స్‎కు అభివాదం చేశారు. అంతే కాదు వారితో కాసేపు ముచ్చటించారు. బద్రీనాథ్‎లో ఫ్యాన్స్‎తో రజనీ చిట్ చాట్‎కు సంబంధించిన పిక్స్, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరుకు ఉన్న బ్రాండే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు ఉన్న ఫాలోయింగే వేరు. ఫ్యాన్స్ అంతా ఆయన్ని ప్రేమగా తలైవా అని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్‎తో కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు తలైవా. తనదైర మార్క్ చూపిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలు వెండితెరపైన పెద్దగా సందడి చేయడం లేదు. ఇన్నాళ్లు ఓటమిని చూసిన రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‏లో వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ నాలుగేళ్ల తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ సందర్శించి స్వామివారికి పూజలు చేశారు.






Updated : 13 Aug 2023 12:13 PM IST
Tags:    
Next Story
Share it
Top