Superstar Rajinikanth : "సంఘీ" వ్యాఖ్యలపై కూమార్తెను సమర్థించిన సూపర్‌స్టార్
X
(Superstar Rajinikanth) ప్రముఖ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ కూమార్తెపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ప్రమోషన్ కోసం ‘సంఘీ’ అనే పదాన్ని ఉపయోగించారంటూ తమిళ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ ఐశ్వర్యపై హిందూ సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన రజనీకాంత్...తన కూతురు ఐశ్వర్య ‘సంఘీ'ని చెడు పదంగా చెప్పలేదన్నారు. కేవలం నాన్న ఆధ్యాత్మిక వ్యక్తి అని మాత్రమే ఆమె చెప్పిందని స్పష్టం చేశారు.
నాన్న అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తిగా తను చెప్పిందని..అందుకే తండ్రిని సంఘీ కాదు అని అభివర్ణించిందని రజనీకాంత్ సమర్థించారు. ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ‘లాల్ సలామ్’ మూవీ ప్రమోషన్ కోసం ఆమె ఈ విషయంపై మాట్లాడిందన్న ఆరోపణలను సూపర్‌స్టార్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని తెలిపారు. కాగా తన తండ్రి సంఘీ కాదు అని లాల్ సలామ్ మూవీ ప్రమోషన్స్ లో ఐశ్యర్వ కామెంట్ చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
‘రైట్ వింగ్’ మద్దతుదారుడు, కార్యకర్త గురించి చెప్పడానికి ‘సంఘీ’ అ నే పదం వాడుతారు. అయితే ఈ పదాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడారంటూ ఐశ్వర్యపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ‘లాల్ సలామ్’ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.