మహేష్ బాబు జిమ్ వీడియో..చూస్తే మతిపోవాల్సిందే..
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం, ఫిట్ నెస్ గురించి చెప్పక్కర్లేదు .నాలుగుపదుల వయుసులో కూడా యువకులకు పోటీగా ఉన్నాడు. కుమారుడు గౌతమ్ తో ఫోటో దిగితే తండ్రిలా కాకుండా అన్నయ్య కనిపిస్తాడు. అందానికి కారణం అడిగితే మాత్రం ఓ చిరునవ్వుతో సమాధానిమిచ్చేస్తాడు. గ్లామర్ విషయంలోనే కాదు ఫిట్ నెస్ విషయంలో అస్సలు రాజీపడడు ఈ రాజకుమారుడు. ప్రతిరోజు అశ్రద్ధ వహించకుండా వ్యాయామం చేస్తుంటాడు. అలాగే, జిమ్‌లో తమ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మహేష్ బాబు తన వర్కౌట్ వీడియోను షేర్ చేయగా...క్షణాల్లో వైరల్ అయ్యింది. మహేష్ వర్కౌట్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
పోకిరీ స్టైల్లో రన్నింగ్..
జిమ్‌లో చేసిన మూడు సెట్ల వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను ఫ్రిన్స్ మహేష్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. వీటిలో తన ఫేవరేట్ స్కిల్‌మిల్ ఫినిషర్ కూడా ఉందని చెప్పారు. రోజువారిగా చేసే కొన్ని వర్కౌట్స్ కేవలం ఒక నిమిషం మాత్రమే చేస్తాను అన్నారు. ఒక నిమిషం పాటు ల్యాండ్‌మైన్ ప్రెస్, మరో నిమిషం పాటు కెటల్‌బెల్ స్వింగ్స్, ఇంకో నిమిషం పాటు స్కిల్‌మిల్ రన్.. ఇలా మూడు సెట్‌లు తన వ్యాయామంలో ఉంటాయని వివరించాడు. అలాగే మీరు ఎన్నిసార్లు చేస్తారు అని కూడా ఫ్యాన్స్ ను మహేష్ బాబు ప్రశ్నించాడు. ఇక జిమ్ లో మహేష్ ను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. మతిపోగొట్టేలా మహేష్ లుక్ ఉందని కామెంట్ చేస్తున్నారు. స్కిల్‌మిల్ మీద ఆయన పరిగెత్తిన తీరు అచ్చం ‘పోకిరి’లో పరిగెత్తినట్టే ఉందని తమ హీరోను పొగిడేస్తున్నారు.
ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నాడు. రీసెంట్ గానే మేకర్స్ ఓ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయగా దానిని అనుకున్న సమయం కన్నా ముందే ఫినిష్ చేసేసారట. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ గుంటూరు కారం చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా తరవాత ఎస్.ఎస్.రాజమౌళితో మహేష్ బాబు సినిమా షురూ కానుంది.