మహేష్‌ని ముప్పుతిప్పలు పెడుతున్న జక్కన్న..స్వయంగా తెలిపిన ప్రిన్స్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో తన కెరీర్లో దూసుకుపోతున్నారు . అయితే మహేష్ ఎలాంటి సినిమా చేసినా..ఎంతటి యాక్షన్ సినిమా అయినా తన లుక్ విషయంలో కొన్ని లిమిట్స్‌లోనే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ..మహేష్ బాబు అంటే సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ప్రిన్స్ది హాలీవుడ్ కట్ అవుట్ అయినా, టాలీవుడ్ పరిధిలోనే తన లుక్, ఫిజిక్ ఉండేలా చూసుకుంటాడు. చక్కని రూపంతో పాటు ఆరడుగుల ఆజానుబాహుడు అయినా సరే, ఆయన ఎప్పుడూ సిక్స్ ప్యాక్ చేయలేదు. ఇన్నేళ్ల కెరీర్లో ఏనాడు చొక్కా విప్పి నటించలేదు. కానీ, ఇప్పుడు రాజమౌళి మహేష్‌తో అలాంటి పని చేయించబోతున్నాడేమో అన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది.
మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ లోపు మహేష్‌ని పాత్రకు తగ్గట్లుగా రాజమౌళి సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మహేష్ గంటల తరబడి జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్నాడు. కండలు పెంచేందుకు కుస్తీలు పడుతున్నాడు. ఇందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే మహేష్ జక్కన్న సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. అందుకే జక్కన్న మహేష్‌ను ముందెప్పుడు చూడని విధంగా చూపించేందుకు ,కండల వీరుడిగా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మహేష్ ఈ కసరత్తులని చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మహేష్ బాబు ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్లో షేర్ చేశాడు. అందులో మహేష్ చేతి కండరాలకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నాడు. శ్రమిస్తుంటే శక్తి పొందుతున్న ఫీల్ కలుగుతుందని కామెంట్ కూడా పెట్టాడు. మహేష్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్‌ను ఇలా చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి-విజయేంద్రప్రసాద్ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం కానుంది. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. దాదాపు 800 కోట్లు ఈ మూవీకి కేటాయించారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇది ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి కథ అని చెప్పారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని, ఇండియానా జోన్స్‌ని తలపించే సినిమా అని అంటున్నారు. భారీ క్యాస్టింగ్‌తో పాటు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు మహేష్ గుంటూరు కారం మూవీ పూర్తి చేస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.