Home > సినిమా > మాటలుండవ్.. కోతలే .. అదిరిన రజినీ జైలర్ ట్రైలర్..

మాటలుండవ్.. కోతలే .. అదిరిన రజినీ జైలర్ ట్రైలర్..

మాటలుండవ్.. కోతలే .. అదిరిన రజినీ జైలర్ ట్రైలర్..
X

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిప అవసరం లేదు. రజినీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం రజినీ నుంచి వస్తున్న మూవీ జైలర్. ఈ మూవీని నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేయగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ను హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు. రజనీ మార్క్ యాక్షన్తో ట్రైలర్ అదిరిపోయింది. దీంతో రజినీ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.

రజనీకాంత్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్తో ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఒకరేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే” అంటూ రజినీ చెప్పిన డైలాగ్కు విజిల్స్ పడడం ఖాయం. టాలీవుడ్ కమెడియన్ సునీల్ ఇందులో డిఫరెంట్ గెటప్‍లో కనిపించాడు. ఇక ఈ మూవీ రజినీ చాలా స్టైలిష్గా కన్పించాడు.



జైలర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సహా జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రజినీ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేవు. దీంతో జైలర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ ఉండడంతో సూపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.




Updated : 3 Aug 2023 10:21 AM IST
Tags:    
Next Story
Share it
Top