Home > సినిమా > బిగ్ బాస్-7 లోకి తల్లీ కూతుళ్ళ ఎంట్రీ?

బిగ్ బాస్-7 లోకి తల్లీ కూతుళ్ళ ఎంట్రీ?

బిగ్ బాస్-7 లోకి తల్లీ కూతుళ్ళ ఎంట్రీ?
X

మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్-7 టెలీకాస్ట్ అవనుంది. ఈసారి కూడా ఈ షోకి నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. దీని ప్రోమో కొన్ని రోజులులగా టీవీల్లో టెలీకాస్ట్ అవుతోంది. ఈ సారి బిగ్ బాస్ కొత్తగా ఉంటుందని....అంతా ఉల్టాపుల్టా అని నాగార్జున ప్రోమోలో తెగ ఊరిస్తున్నారు కూడా. అయితే ఇప్పటివరకూ బిగ్ బాస్లో ఎవరెవరు పాల్గొంటారు అన్నది మాత్రం అఫీషియల్ గా తెలియదు. అయితే వాళ్ళఉ వెళతారు, వీళ్ళు వెళతారు అంటూ బోలెడు వార్తలు మాత్రం వస్తున్నాయి. తాజాగా ఓ తల్లీ కూతుళ్ళు బిగ్ బాస్-7లోకి వెళతారని వినిపిస్తోంది.





ఇప్పటికి బిగ్ బాస్-7లో వెళ్ళేవాళ్ళల్లో టీవీ నటులు అమరదీప్ చౌదరి- తేజస్విని జంట, శోభాశెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతానాయుడు, దుర్గారావు పంతులు, దీపికా పిల్లి, జబర్దస్త్ పవిత్ర, యని పావని, వర్ష ఇలా చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. దాదాపు వీరందరూ వెళ్ళడం ఖాయమే అని కూడా అంటున్నారు. వీళ్ళతో పాటూ యాక్టరెస్ సురేఖావాణి ఆమె కూతురు సుప్రీత కూడా వెళ్ళనున్నారని గట్టి సమాచారం.





నటిగా సురేఖావాణి అందరికీ పరిచయమే. అది మాత్రమే కాదు ఈమె కూతురుతో కలిసి చేసే అల్లరి, ఫ్యాషన్ లాంటి వాటికి కూడా యూట్యూబ్, ఇన్ట్సాగ్రామ్ లలో బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సుప్రీత ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ లో, టీవీ షోల్లో యాక్ట్ చేస్తోంది. త్వరలో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అందుకే ఆమెకు బిగ్ బాస్ మంచి ప్లాట్ ఫామ్ అవుతుందని, చాలా హెల్ప్ అవుతుందని అంటున్నారు. ఈ గేమ్ షో వలన ప్రేక్షకులకు దగ్గర అవుతుందని అంటున్నారు. ఈ తల్లీ కూతుళ్ళు బిగ్ బాస్ లోకి వెళితే ఫుల్ క్రేజీగా ఉంటుంది.





Updated : 7 Aug 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top