Home > సినిమా > హీరోయిన్ గా సురేఖా వాణి కూతురు.. హీరో ఎవరంటే

హీరోయిన్ గా సురేఖా వాణి కూతురు.. హీరో ఎవరంటే

హీరోయిన్ గా సురేఖా వాణి కూతురు.. హీరో ఎవరంటే
X

సురేఖా వాణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన గురించి తెలియని వారు ఉండరు. కొన్నాళ్లుగా కూతురుతో కలిసి సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. కూతురుతో కలిసి పొట్టి బట్టలు వేసుకుని సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. రీసెంట్ గా తిరుపతిలో గుండు కొట్టించుకుని కొంత ఆశ్చర్యపరిచిన సురేఖావాణి చిరకాల కోరిక ఒకటి నెరవేరబోతోంది. నటిగా ఒకే తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన సురేఖా వాణి తన కూతురును హీరోయిన్ గా చూడాలనుకుంది.ఆ కోరికే ఇప్పుడు నెరవేరబోతోంది.

సురేఖావాణి కూతురు పేరు సుప్రీత. సోషల్ మీడియాను రెగ్యులర్ ఫాల్ అయ్యే వారికి ఆమె చాలా బాగా పరిచయం ఉండే ఉంటుంది. సినిమాల్లోకి రాకముందే హాట్ హాట్ గా కనిపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. దీని వల్లే తనకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనలో ఓ హీరోయిన్ ఉందనే విషయం చెప్పేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. బట్ తను వయసుకు మించిన లుక్ తో కనిపిస్తుందనేది కూడా ఒప్పుకుని తీరాలి. మరి కారణాలు ఇవే అని చెప్పలేం కానీ కూతురు ఇష్టాన్ని గౌరవించిన తల్లిగా సురేఖా వాణి ఆమె విషయంలో ఎప్పుడూ ఏ అడ్డంకీ చెప్పలేదు. పైగా తను కూడా కూతురులాగానే చాలా స్వేచ్ఛగా తన బ్రతుకు తను బ్రతికేస్తోంది. అయితే ఆమెను హీరోయిన్ గా చూడాలన్న కల ఫైనల్ గా నెరవేరబోతోందిప్పుడు. మరి ఈ సినిమాలో హీరోగా నటించేది ఎవరో తెలుసా.. అమర్ దీప్. యస్.. సీరియల్ హీరోగా ఆకట్టుకుని బిగ్ బాస్ తో మరింత బాగా ఫేమ్ అయిన అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్ గాఓ సినిమా తెరకెక్కబోతోంది. మహేంద్రనాథ్ కొండ్ల అనే వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మరి అమర్ దీప్, సుప్రీత జంట వెండితెరపై ఎలా ఉంటారో చూడాలి.

Updated : 1 Feb 2024 1:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top