Home > సినిమా > ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'రోలెక్స్‌'‌పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'రోలెక్స్‌'‌పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోలెక్స్‌‌పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

గతేడాది కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'విక్రమ్' సినిమా పెద్ద హిట్టయిందో సినీ అభిమానులకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో హీరో సూర్య పోషించిన రోలెక్స్‌ రోల్

సినిమాకు హైలెట్ గా నిలిచింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సూర్య నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించారు. ఆయన క్యాక్టరైజేషన్, లుక్, హావభావాలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో 'రోలెక్స్‌' పాత్రపై పూర్తి స్థాయిలో ఒక సినిమా చేస్తే చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోలెక్స్‌ ప్రాజెక్ట్ పై తాజాగా సూర్య క్లారిటీ ఇచ్చారు.

హీరో సూర్య ఆదివారం తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్స్‌ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా 'రోలెక్స్‌' ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్‌ ఆ పాత్రని బేస్ చేసుకొని ఓ కథ చెప్పారని తెలిపారు. అది తనకెంతో నచ్చిందని.. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుందని స్పష్టం చేసారు. అంతేకాదు రోలెక్స్‌ మూవీ పూర్తయిన తర్వాత లోకేష్ దర్శకత్వంలో ‘ఇరుంబు కై మాయావి’ అనే సినిమా చేయనున్నట్లు సూర్య వెల్లడించారు.

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘విక్రమ్‌’ సినిమాలో డ్రగ్‌ మాఫియాను శాసించే రోలెక్స్‌ పాత్రలో నటించారు. మెడ మీద టాటూ, డిఫెరెంట్ హెయిర్ స్టైల్ మరియు గడ్డంతో కొత్తగా కనిపించారు. మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ఆయన పాత్ర సినీ అభిమానులను ఎంతో సర్ప్రైజ్ చేసింది. అతను తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా, దానికే థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. 'లైఫ్ టైం సెటిల్ మెంట్ రా' అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఎంతో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే సూర్య పాత్రను బేస్‌ చేసుకుని లోకేశ్‌ కనగరాజ్ ఓ సినిమా చేస్తారంటూ గతంలో ప్రచారం సాగింది. లేటెస్టుగా సూర్య వ్యాఖ్యలతో రోలెక్స్ ప్రాజెక్ట్‌ పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సూర్య .. శివ దర్శకత్వంలో 'కంగువ' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాబోయే అక్టోబర్‌ నుంచి తన 43వ చిత్రాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వెట్రిమారన్‌ ‘విడుదలై 2’ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత తమ కాంబినేషన్ లో ‘వాడి వసల్‌’ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని చెప్పుకొచ్చారు.





Nadippin Nayagan #Suriya in recent fans meet :#Kanguva has came out 100 times better than what was expected before shooting.#Suriya43 to commence from October.#VaadiVaasal shoot starts once Vetrimaaran completes #Viduthalai part 2.

Updated : 14 Aug 2023 9:00 AM IST
Tags:    
Next Story
Share it
Top