Taapsee Pannu : పదేళ్లుగా అతడితో డేటింగ్లో ఉన్న అంటున్న తాప్సీ
X
బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని సినీ నటి తాప్సీ తెలిపింది. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడిందని అమ్మడు చెప్పింది.“నేను గత పదేళ్లుగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు. 13 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నాను. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే అతడిని కలిశాను. ఇప్పటికీ అదే వ్యక్తిని ప్రేమిస్తున్నాను.
అతడిని విడిచి బ్రేకప్ చెప్పి మరొకరితో ప్రేమలో ఉండాలనే ఆలోచనలు లేవు. ఎందుకంటే మేమిద్దరం మా బంధంలో చాలా హ్యాపీగా ఉన్నామని ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా లవ్ మ్యాటర్ గురించి ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు” అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది. కానీ తర్వాత ఈ బ్యూటీకి నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిప్ట్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన డంకీ మూవీతో మరోసారి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అటు ఈ బ్యూటీ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.