Home > సినిమా > తాళిలో ట్రాన్స్ జెండర్ గా సుస్మితాసేన్

తాళిలో ట్రాన్స్ జెండర్ గా సుస్మితాసేన్

తాళిలో ట్రాన్స్ జెండర్ గా సుస్మితాసేన్
X

ఓటీటీలు వచ్చాక వెబ్ సీరీస్ లు చూసేవారు చాలా ఎక్కువ అయ్యారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు...బాషా బేధాలు లేకుండా అన్నీ రకాలు చూసేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా విభిన్నమైన కథలతో వెబ్ సీరీస్ లను తీసుకువస్తున్నాయి. జాతీయ దర్శకుడు రవి జాదవ్ తెరకెక్కించిన వెబ్ సీరీస్ తాళి. ఇదొక ట్రాన్స్ జెండర్ల కథ. ఇందులో మాజీ మిస్ యూనివర్శ సుస్మితాసేన్ ట్రాన్స్ జెండర్ గా నటించింది.

ఆగస్టు 15 నుంచి జియో సినిమాలో తాళి వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ అవనుంది. దీని ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించామని దర్శకుడు చెబుతున్నారు. తాళిలో సుస్మితా గెటప్ ఆసక్తిగా ఉంది. ట్రాన్స్ జెండర్ల హక్కుల పోరాటం నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ కథ ఉండనుంది.

నా దగ్గరకు ఈ కథ రాగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నా అని చెబుతున్నారు సుస్మితాసేన్. ట్రాన్స్ జెండర్ గా నన్ను నేను మలుచుకోవడానికి ఆరు నెలలు టైమ్ పట్టింది. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరీ సావంత్ చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆమె కథే తాళి. ఈ సీరీస్ కోసం ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండడం నా అదృష్టం అంటున్నారు సుస్మిత. నా నిజ జీవిత పాత్రలో సుస్మితాసేన్ చాలా బాగాయాక్ట్ చేశారని గౌరీ సావంత్ చెప్పారు. తన కథను వెబ్ సీరీస్ గా తీయడం ఆనందం కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు.

తాలి వెబ్ సీరీస్ ట్రాన్స్ జెండర్ల పట్ల అందరూ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తుంది. దీనివల్ల కొంతలో కొంత అయినా ప్రజల్లో మార్పు వస్తుందని సీరీస్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.






Updated : 7 Aug 2023 8:04 PM IST
Tags:    
Next Story
Share it
Top