Home > సినిమా > ప్రాజెక్ట్ కె లో క్రూరవిలన్ గా కమల్?

ప్రాజెక్ట్ కె లో క్రూరవిలన్ గా కమల్?

ప్రాజెక్ట్ కె లో క్రూరవిలన్ గా కమల్?
X

తెలుగు డైరెక్టర్ నాగఅశ్విన్ తీస్తున్న అతి పెద్ద సినిమా ప్రాజెక్ట్ కె. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీపికా పడుకోన్ హీరోయిన్ గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి లోకనాయకుడు కమల్ హసన్ కూడా వచ్చి చేరాడు. ఇప్పుడు ఇందులో కమల్ పాత్ర గురించి మరో కొత్త వార్త బయటకు వచ్చింది.





ప్రాజెక్ట్ కె గురించి నాగఅశ్విన్ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదనే విధంగా ఉండాలని భావిస్తున్నాడు. సినిమా షూటింగ్ కూడా అలాగే జరుగుతోందని టాక్. సినిమా అద్బుతంగా ఉంటుందని ఇన్ సైడ్ సమాచారాలు కూడా అందుతున్నాయి. ఇప్పుడు కమల్ రావడంతో ఈ మూవీ మీద హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకూ ఒక ఎత్తు ఇప్పుడు మరొక ఎత్తు అంటున్నారు. ఎంత పెద్ద సినిమా కాకపోతే అందరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తారని అంటున్నారు.





ఇక ఈ సినిమాలో కమల్ హసన్ క్రూరమైన విలన్ గా నటిస్తున్నారని చెబుతున్నారు. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకునే స్వార్ధపరుడిగా కమల్ పాత్ర ఉంటుందిట. ప్రాజెక్ట్ కె కూడా మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తోంది. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే సినిమాలో అన్ని పాత్రలు ఇతిహాస పాత్రలను పోలి ఉంటాయిట. ప్రభాస్ క్యారెక్టర్ చెడుని అంతం చేయడానికి పుట్టే కల్కి అని అంటున్నారు. ప్రపంచాన్ని అంతం చేయాలని కమల్ పాత్ర ప్రయత్నిస్తుంటే ప్రభాస్ పాత్ర దాన్ని ఆపుతుందని సమాచారం.

కమల్ అడపాదడపా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కనిపించాడు. అయితే ఇప్పటివరకూ పూర్తి విలన్ గా నటించలేదు. ప్రాజెక్ట్ కె లో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు కమల్. మామూలుగానే యాక్టింగ్ తో చంపేసే లోకనాయకుడు ఇలా విలన్ గా ఇంకా చించేస్తాడని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.


Updated : 5 July 2023 10:19 AM IST
Tags:    
Next Story
Share it
Top