ట్విస్ట్ మామూలుగా లేదు.. ఆ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ
X
తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలో ఆన్ స్క్రీన్ పై అకీరా కనిపించబోతున్నట్లు వార్తుల వినిపిస్తున్నాయి. అది కూడా పవన్ సినిమాలోనే. సాహో డైరెక్టర్ సుజిత్.. పవన్ అప్ కమింగ్ సినిమా ఓజీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదే సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలో అప్పట్లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా తాజాగా రిలీజ్ అయిన పవన్ సినిమా బ్రో చూడటానికి అకీరా ఓపెనింగ్ రోజే థియేటర్ కు వెళ్లాడు.
ఫ్యాన్స్ కు ఎలా ఉంటే నచ్చుతుంది. ఎలా యాక్ట్ చేయాలి. ఏ స్టైల్ వాళ్లు ఇష్టపడతారు అనే విషయాలను ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓజీలో పవన్ మార్షల్ ఆర్ట్స్ లో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. కాగా, అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కచ్చితంగా సినిమాలో ఎంట్రీ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు అకీరా ఆ సినిమాలో నటిస్తాడనే వార్తతో ఆ హైప్ మరింత పెరిగింది.