Tamannaah Bhatia: ఆ చిత్రాల్లో నటించకపోవడమే మంచిది..మిల్కీ బ్యూటీ సంచలన కామెంట్స్
X
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో. ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టిన దక్షిణాది తారలు చాలా మంది అదే పని చేస్తున్నారు. సౌత్ సినిమాల్లో అవకాశాల కోసం పాకులాడి, నిర్మాతల ఆసరా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్లు ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో ముంబైలో మకాం వేసి దక్షిణాది చిత్ర పరిశ్రమతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తించడం ఓ ఫ్యాషన్‌గా మారింది. మొన్నాఇలియానా, నిన్న తాప్సీ, ఇవాళ తమన్నా అదే పని చేస్తున్నారు. దక్షిణాది చిత్రాల ద్వారా స్టార్డమ్ సాధించిన మల్కీ బ్యూటీ ఇప్పుడు అదే ఫిల్మ్ ఇండస్ట్రీని కించపరిచేలా కామెంట్స్ చేస్తోంది.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.." సౌత్ సినిమాల్లో కమర్షియల్ అంశాలకే ప్రయారిటీ ఇస్తారు. కొన్ని సినిమాల్లో అసలు నా క్యారెక్టర్‌కి స్టోరీకి ఎలాంటి సంబంధం ఉండదు. డైరెక్టర్లకు ఆ కొరతను సరి చేయమని చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే అలాంటి సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం లేక తప్పుకున్నాను. సౌత్ సినిమాల్లో హీరోలకు అనుగుణంగా కథలు రూపొందిస్తున్నారు. హీరోయిన్లకు ప్రాధాన్యత లేని అలాంటి చిత్రాల్లో నటించకుండా ఉండటమే బెటర్ అని నిర్ణయించుకున్నా. కానీ నాకు నటించడం అంటే చాలా ఇష్టం. హిట్, ఫ్లాప్ గురించి నేను పెద్దగా పట్టించుకోను"అని తమన్నా తెలిపారు.